HomeTelanganaPolitics

బీజేపీలో మల్కాజిగిరి రాజకీయం.. ఆ సీటుపై కన్నేసిన ఈటల… ఆయనకు రాకుండా చక్రం తిప్పుతున్న బండి

బీజేపీలో మల్కాజిగిరి రాజకీయం.. ఆ సీటుపై కన్నేసిన ఈటల… ఆయనకు రాకుండా చక్రం తిప్పుతున్న బండి

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పది స్థానాలు గెల్చుకోవాలని బీజేపీ ప్రణాళికలు వేస్తున్నది. దాని కోసం జాతీయ నాయకత్వమే రంగంలోకి దిగింది కూడా. అయితే స్థాని

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల – కేసీఆర్ పై ఈటెల పోటీ
బీజేపీ సీనియర్లు బహిర్గత పరుస్తున్న స్వంత పార్టీ కుట్రాజకీయాలు… గందరగోళంలో ఆ పార్టీ శ్రేణులు
రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసిన బీజేపీ – మళ్ళీ గోషామహల్ నుంచి ఎన్నికల బరిలోకి

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పది స్థానాలు గెల్చుకోవాలని బీజేపీ ప్రణాళికలు వేస్తున్నది. దాని కోసం జాతీయ నాయకత్వమే రంగంలోకి దిగింది కూడా. అయితే స్థానిక రాజకీయాలు, నాయకుల మధ్య లేని సఖ్యత అగ్రనాయకులు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయట.

గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను గెల్చుకున్న బీజేపీ ఆ నాలుగు కాక మరో ఆరు సీట్లపై కన్నేసింది. అందులోనూ మల్కాజిగిరి సీటు గట్టిగా ప్రయత్నిస్తే గెల్చుకోవచ్చనే అభిప్రాయంతో ఉంది ఆ పార్టీ. ఈ నేపథ్యంలో ఆ సీటు గురించి నాయకుల మధ్య‌ పోటీ తీవ్రమయ్యింది.

ఇక బీజేపీ నాయకుడు ఈటల రాజేంధర్ శాసనసభ ఎన్నికల్లో నిలబడ్డ రెండు చోట్లా ఓడిపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ముందు ఆయన కరీంనగర్ సీటు నుంచి పోటీ చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ తప్పించి ఆ సీటు తనకు కేటాయించాలని అధిష్టానం దగ్గర డిమాండ్ చేసినట్టు సమాచారం. ఆయన్ అప్రపోజల్ కు అధిష్టానం ఒప్పుకోలేదు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నాడనే ప్రచారం సాగింది. కాంగ్రెస్ ఆయనకు కరీంనగర్ ఎంపీ టికట్ ఇవ్వడానికి సిద్దపడిందని , త్వరలోనే ఆయన కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని ఆయనకు దగ్గరివారే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఆ విషయాలపై స్పందించిన ఈటల… కరీంనగర్‌ లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి.. తాను అక్కడ టికెట్ ఆశించడం లేదని తెలిపారు. ఇదే సమయంలో… తనకు మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్టానాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా.. తనకు అధిష్టానం ఎలా చెబితే అలా వింటానని ఈటల స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నాననే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఆ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈటల చెప్పుకొచ్చారు.

కాగా మల్కాజిగిరి పార్లమెంటు స్థానం అన్ని పార్టీలకు హాట్ కేక్ గా మారింది అన్ని పార్టీల్లోనూ ఆ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీలో కూడా ఆ సీటును ఆశిస్తున్నవారి సంఖ్యపెఅద్దగానే ఉంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీచేయాలని బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్), పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య మొదలైన వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుంది.

మరో వైపు ఈటలకు మల్కాజిగిరి సీటు దక్కకుండా చేయడం కోసం ఆయన వ్యతిరేక వర్గం బండి సంజయ్ నాయకత్వంలో తీవ్రప్రయత్నమే చేస్తున్నట్టు చెప్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఈటల నిలబడితే వాళ్ళు బీజేపీకీ ఓట్లు వేయరని అధిష్టానం చెవులో ఊదినట్టు సమాచారం. అంతే కాదు చివరి అస్త్రంగా ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని, అలా చేస్తే సౌత్ ఇండియా మొత్తం ప్రభావం పడుతుందని కూడా అధిష్టానానికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా తీవ్రంగా చేస్తున్నట్టు తెలుస్తోంది.

తనకే టికట్ రావడం కోసం మురళీధర్ రావి ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మల్క కొమురయ్య కూడా కొందరు ఢిల్లీ బీజెపి పెద్దల టచ్ లో ఉన్నట్టు సమాచారం. మరో వైపు వీరిద్దరికి టికట్ రాకుండా ఈటలకు వస్తుందేమో ఐన్ని అడ్డంకుల దాటుకొని ఈటల రాజేంధర్ ఎంపీ సీటు సాధిస్తారా అనేది పెద్ద ప్రశ్నే.