కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని నిన్నటి దాకా జరిగిన ప్రచారం ఉట్టిదని తేలిపోయింది. ఆయనకు షాక్ ఇస్తూ ఆయన స్థా
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని నిన్నటి దాకా జరిగిన ప్రచారం ఉట్టిదని తేలిపోయింది. ఆయనకు షాక్ ఇస్తూ ఆయన స్థానంలో పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. తమ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ల పేర్లను ప్రకటించింది.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు ఖరారయిందనే ప్రచారం నిన్నటి వరకు జరిగింది. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని నిన్న దయాకర్ కు పార్టీ పెద్దలు ఫోన్ చేసి చెప్పారట. దీంతో, ఆయన అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఒక్క రోజులోనే సీన్ మారిపోయింది. దయాకర్ స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ ప్రకటించింది.
ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. 29వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి, రిజల్ట్స్ ను ప్రకటిస్తారు.
కాగా, ఈ విషయంపై అద్దంకి దయాకర్ స్పందిస్తూ పార్టీ తనకు మరింత ఉన్నత పదవి ఇస్తుందని, తన అభిమానులు అసంతృప్తికి గురి కావద్దని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ విదేయుడిగా అదిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిన భాద్యత ఉంది.
— Addanki Dayakar (@ADayakarINC) January 17, 2024
పార్టీ కోసం అందరం సహనంగా ఉండాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనను ముందుకు తీసుకపోవడం తన లక్ష్యం.@INCIndia @kharge @RahulGandhi @revanth_anumula @DeepaDasmunsi pic.twitter.com/8lXYhDd4hM