HomeTelanganaPolitics

గుంటురు కారం మూవీలో విలన్ ల పేర్లు మార్క్స్, లెనిన్ – ఆ పేర్లను వెంటనే తొలగించాలని ఏఐఎస్ ఎఫ్ డిమాండ్

గుంటురు కారం మూవీలో విలన్ ల పేర్లు మార్క్స్, లెనిన్ – ఆ పేర్లను వెంటనే తొలగించాలని ఏఐఎస్ ఎఫ్ డిమాండ్

ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం 'గుంటూరు కారం'లో విలన్‌ల పేరును మార్క్స్, లెనిన్‌గా పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌

టాలీవుడ్ స్టార్లను ‘నాని’ అవమానించాడా? మండిపోతున్న ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్
మంత్రి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం : నాగార్జున
ఆదిపురుష్ బడ్జెట్ కన్నా చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువే

ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘గుంటూరు కారం’లో విలన్‌ల పేరును మార్క్స్, లెనిన్‌గా పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌) ఆ సినిమా నుంచి మార్క్స్‌, లెనిన్‌ పేర్లను వెంటనే తొలగించాలని సెన్సార్‌ బోర్డును డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని ఏఐఎస్‌ఎఫ్ హెచ్చరించింది.

సినిమాలో విలన్‌లకు మార్క్స్‌, లెనిన్‌ పేర్లను వాడినందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కథానాయకుడు మహేశ్‌ బాబు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ మంగళవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే సినిమా పేర్లను తొలగించేలా సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.