HomePoliticsAndhra Pradesh

వైసీపీకి షాక్ ఇచ్చిన ముద్రగడ పద్మనాభం

వైసీపీకి షాక్ ఇచ్చిన ముద్రగడ పద్మనాభం

త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం భారీ కసరత్తు చేస్తున్న వైసీపీకి కాపు నాయకుడు ముద్ర గడ పద్మనాభం షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీకి

వెంటనే పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో BRS, ఏపీలో YSRCP స్వీప్..టైమ్స్ నౌ సర్వే
నారా లోకేష్ , బ్రాహ్మణి లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట!
అంగన్‌వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు

త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం భారీ కసరత్తు చేస్తున్న వైసీపీకి కాపు నాయకుడు ముద్ర గడ పద్మనాభం షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చిన ఆయన ఈసారి వైసీపీలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ముద్ర గడ పద్మనాభం 1989-94 మధ్య కాలంలో కాపులకు రిజర్వేషన్ కోసం పోరాడారు. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1999 వరకు టీడీపీలో ఉన్న ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన కాపు రిజర్వేషన్ల హామీ అమలు చేయాలని ఉద్యమం చేశారు. నాడు టీడీపీ ఆయన పట్ల‌ అమర్యాదకరంగా వ్యవహరించింది. దీంతో ఆయన పరోక్షంగా వైసీపీకి మద్దతు పలికారు.

గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్ర గడ పద్మనాభం ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని భావించారు. అయితే, ఆయనకు కోరుకున్న స్థానం ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన వైసీపీలో చేరలేదు.

తాజాగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పంపడంతో తనను కలవడానికి వచ్చిన‌ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఆయన కలవకుండానే తిప్పిపంపారు. తాను వైసీపీలో చేరే ప్రసక్తి లేదని, పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేనలో లేదా చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీలో చేరతానని చెప్పారు.

ముద్రగడ‌ నిర్ణయం వైసీపీకి పెద్ద షాక్‌గా మారింది. కాపుల ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి వైసీపీ చేస్తున్న కృషి బూడిదలోపోసిన పన్నీరులా మారిపోతున్నది. ముద్ర గడ పద్మనాభం వైసీపీలో చేరకపోవడం ఆ పార్టీకి ఈ వర్గం ఓట్లు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉందని అనుకుంటున్నారు.