HomeNational

ఢిల్లీలో భారీ భూకంపం

ఢిల్లీలో భారీ భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైందని, దీనిని బలమైన భూకంపంగా పరిగణిస్తున్నట్లు నే

ఆ ముఖ్యమంత్రి జైలు నుండే పరిపాలిస్తారట‌
30 పార్టీలు Vs 24 పార్టీలు… దేశంలో వేడి పుట్టిస్తున్న రాజకీయాలు
బాలుడి ప్రాణాలు తీసిన తల్లితండ్రుల మూఢనమ్మకం… గంగలో ముంచి చంపేశారు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైందని, దీనిని బలమైన భూకంపంగా పరిగణిస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపం యొక్క కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. ఉత్తర భారతదేశం , పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.

ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ కూడా ప్రకంపనలు వచ్చాయి.ఢిల్లీ లో సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు ఈ ప్రకంపనలతో ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.