తెలంగాణను పరిపాలించడానికి ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారని, అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు కలలో కూడా అనుకోలేదని బీఆరెస్ వర్కింగ్ ప
తెలంగాణను పరిపాలించడానికి ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారని, అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు కలలో కూడా అనుకోలేదని బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు నోటికి ఏది వస్తే అది హామీలుగా ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చారని,కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మనము రేషన్ కార్డులు ఇవ్వలేదు అని తప్పుడు ప్రచారం చేశారని, తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2.8 కోట్ల రేషన్ కార్డులు ఇచ్చిందని ఆయన తెలిపారు.
అంతే కాకుండా మనం రాష్ట్రాన్ని నీటిపారుదలతో సుసంపన్నం చేశాం.రైతులకు రుణమాఫీ చేశాం.ఉద్యోగస్తులు, పెన్షనర్లకు పెన్షన్లు పెంచాం.సింగరేణి కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాం.రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించాం అని కేటీఆర్ చెప్పారు. మనం పనులు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చామని ప్రచారం దృష్టి పెట్టలేదని అలా చేసి ఉంటే మనమే గెలిచేవాళ్ళమన్నారు కేటీఆర్.
మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేలా చూస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.