HomeTelangana

హైదరాబాద్ లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ – 50 మందికి గాయాలు

హైదరాబాద్ లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ – 50 మందికి గాయాలు

హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చార్మ

గుమ్మడి విఠల్ రావు గద్దర్ గా ఎలా మారారు ?
ఉల్లిగడ్డ ధర మండిపోతోంది
మెట్రో రైలు కొత్త మార్గాలు ఖరారు – ఆమోదం తెలిపిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. రైలు ఇంజన్ ప్లాట్ ఫాం సైడ్ వాల్ ను ఢీ కొట్టిందని చెప్పారు. ఈ ఘటనలో 50మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు. ఈ సంఘటనతో పలువురు ప్రయాణీకులకు గుండెపోటు వచ్చినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఓ అంచనాకు రాలేదని తెలిపారు.

నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్టు సమాచారం. దాంతో డెడ్ ఎండ్ లైన్ ప్రహరికి రైలు తాకి రైలు బోగీలు ట్రాక్ మీద నుంచి కిందకి జరిగాయి
స్టేషన్ ప్లాట్ ఫాంపై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇంజన్ తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా రైలు ప్రమాదంపై హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.పెను ప్రమాదం తప్పిందని.. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు.