తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగ సభల్లో ఆయన స్పీచులన్నా, ప్రెస్ మీట్లన్నా జనం ఆసక్తిగా వినావారు. ప్రెస్ మీట
తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగ సభల్లో ఆయన స్పీచులన్నా, ప్రెస్ మీట్లన్నా జనం ఆసక్తిగా వినావారు. ప్రెస్ మీట్లలో ఎన్ని గంటలు మాట్లాడినా జనం టీవీల ముందు కూర్చొని ముక్క వదలకుండా వినేవాళ్ళు. ప్రత్యర్థుల మీద ఆయన వేశె పాంచూళూ, అయాణా చేప్పె పీత్తాకాట్హాళ్ కొశాం జాణాం చేవూళూ కొశూకూణె వఱూ.
అయితే ఇప్పుడెందుకో కేసీఆర్ స్పీచుల్లో పస తగ్గిందంటున్నారు ప్రజలు. ఇంతకు ముందు చూపిన ఆసక్తి కూడా చూపించడంలేదు. పాత పంచులు లేవు… పిట్ట కథలు లేవు… ఇప్పుడు ఆయన మాటలన్నీ రొడ్డకొట్టుడుగా ఉంటున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదా ? లేక ఆయనలోనే ఉపన్యాస కళ తగ్గిందా అనేది చర్చ జరుగుతోంది.
అంతే కాదు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ లో అసహనం కూడా చాలా పెరిగిందనే ఆరోపణలొస్తున్నాయి. గతంలో ప్రెస్ మీట్లలో జర్నలిస్టులపై అసహనం ప్రదర్శ్హించడం, అవహేళన చేయడం తో మొదలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలమీద ప్రదర్శిస్తున్న అసహనాన్ని రుజువుగా చూపిస్తున్నారు విశ్లేషకులు.
మంగళవారంనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులోని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుంటే అభిమానులు, కార్యకర్తలు ఈలలు, కేకలేశారు. దీంతో కేసీఆర్ కు ఎందుకో మండిపోయింది.కార్యకర్తలపై అసహనం ప్రదర్శించాడు. ఎవడ్రావాడు…చుట్టు ఉన్నవాళ్ళు వాణ్ణి అణిగబట్టండి… అరె హౌలే.. సభలో మాట్లాడాలా..? ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలారా..? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
సభల్లో ఈ మధ్య కేసీఆర్ ఆవేశాన్ని జనం చూస్తున్నారు కానీ మరీ ఈ విధంగా మాట్లాడటంతో అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి ప్రజలంతా ఒక్కసారి కామ్ అయిపోయారు. తమ నాయకుడు ఇంత అసహనం ఎందుకు ప్రదర్శిస్తున్నాడో అర్దం కాక కార్యక్ర్తలు స్థానిక నాయకులు తలలు పట్టుకుంటున్నారు.