HomeTelanganaPolitics

బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?

బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకుల జంపింగులు పెరిగిపోతున్నాయి. బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలోని టికట్ రాని, అసంత్రుప్తిగా ఉన్న నా

కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
‘అరే హౌలే..ఎవడ్రా వాడు….’ ప్రజలపై కేసీఆర్ అసహనం
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శతృవులయ్యారా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకుల జంపింగులు పెరిగిపోతున్నాయి. బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలోని టికట్ రాని, అసంత్రుప్తిగా ఉన్న నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిపోతున్నారు. ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ఈ పార్టీలు మారే కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరు కాంగ్రెస్, బీఆరెస్ కండువాలు కప్పుకుంటున్న నేపథ్యంలో మరో సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది.

ముషీరాబాద్ బీజేపీ సీటు మీద ఆశలు పెట్టుకున్న బీజేపీ కురువృద్ధుడు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆ సీటును పూసల రాజుకు కేటాయించడంతో ఆగ్రహంగా ఉన్నారు. ఇదే అదునుగా అధికార బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆమెతో మాట్లాడి నామినేటెడ్ పదవి ఆఫర్ చేసి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం.
తన పట్ల పార్టీ అన్యాయంగా ప్రవర్తించిందని, ఎంపీ లక్ష్మణ్ కు పోటీ అవుతాననే అక్కసుతో తనను రాజకీయంగా పార్టీ పెద్దలు సమాధి చేసేందుకు కుట్ర చేశారని విజయలక్ష్మి తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ఎంతో కాలంగా నియోజకవర్గంలో పని చేస్తున్న, ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న తనను కావాలనే అవమానించారని ఆమె ఆగ్రహంగా ఉన్నారు. టికట్ తనకే ఇస్తామని నమ్మించి చివరి నిమిషంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కలిసి తనను మోసం చేశారని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో విజయ లక్ష్మి బీఆరెస్ పెద్దలు ఇచ్చిన ఆఫర్ ను అంగీకరించి గులాబీ కండువా కప్పుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఆమె పార్టీ మారుతున్నారన్న ప్రచారం తీవ్రంగా జరుగుతున్నప్పటికీ బీజేపీ నాయకులెవరూ ఆమెతో మాట్లాడి బుజ్జగించడానికి ప్రయత్నించలేదని తెలుస్తోంది. దాంతో ఆమె పార్టీ మారడం ఖాయమని ఆమె అనుచరులు చెప్తున్నారు. హైదరాబాద్ రాజకీయాల్లో ఎంతో చరిత్ర ఉన్న దత్తాత్రేయ కుమార్తె బీజేపీని వదిలి బీఆరెస్ లో చేరడం బీజేపీ పెద్ద దెబ్బే అవుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.