HomeTelanganaPolitics

ఒంటరి పోరుకే సిద్దమైన CPM …తొలి జాబితా రిలీజ్

ఒంటరి పోరుకే సిద్దమైన CPM …తొలి జాబితా రిలీజ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో CPM ఒంటరి పోరుకు సిద్దమైంది. 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ చివరకు 17 స్థానాల్లో పోటీ చేయాలని

మూడవ జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, రెండు చోట్ల నుంచి రేవంత్ పోటీ
‘ఇండియా’ కూటమికి మోడీ భయపడుతున్నాడా ?
తెలంగాణ బీజేపీకి షాక్ – మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో CPM ఒంటరి పోరుకు సిద్దమైంది. 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ చివరకు 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. 14 మంది అభ్యర్థులతో మొదటి లిస్ట్ ప్రకటించింది.

CPM కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే వీరితో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ చివరి వరకు ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ ఒకే సీటు ఇస్తామనడంతో CPM ఒంటరిగానే రంగంలోకి దిగుతోంది. ఆ రెండు పార్టీల పొత్తుకు సీపీఐ కూడా చివరివరకు ప్రయత్నించింది.

సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా:

కారం పుల్లయ్య (భద్రాచలం, ఎస్టీ),
పిట్టల అర్జున్ ( అశ్వారావుపేట, ఎస్టీ),
తమ్మినేని వీరభద్రం (పాలేరు),
పాలడుగు భాస్కర్ (మధిర, ఎస్సీ),
భూక్యా వీరభద్రం (వైరా, ఎస్టీ),
ఎర్ర శ్రీకాంత్ (ఖమ్మం),
మాచర్ల భారతి (సత్తుపల్లి (ఎస్సీ),
జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ),
చినవెంకులు (నకిరేకల్, ఎస్సీ),
కొండమడుగు నర్సింహ (భువనగిరి),
మోకు కనకారెడ్డి (జనగామ),
పగడాల యాదయ్య (ఇబ్రహీంపట్నం),
జే మల్లికార్జున్ (పటాన్‌చెరు),
ఎం దశరథ్ (ముషీరాబాద్)
నేటి సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.