రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ తరహాలో ‘బుల్‌డోజర్’ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆదివారం
రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ తరహాలో ‘బుల్‌డోజర్’ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆదివారం హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు కల్పిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగిస్తామని ఆయన ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “సంఘ వ్యతిరేక కార్యకలాపాలు , నేరాలకు పాల్పడే” AIMIM పార్టీ కార్యకర్తలు, నాయకులపై బిజెపి బుల్డోజర్ విధానాన్ని ఉపయోగిస్తుందని అన్నారు. మజ్లిస్ నేరగాళ్లపై ఉక్కు పాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు.
ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేమని, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు.