HomeTelanganaPolitics

55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

తెలంగణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేయడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం చాలా కసరత్తు చేసి చివరకు ఈ రోజు 55 మం

మధుయాష్కీ, పొంగులేటికి కాంగ్రెస్ లో కీలక పదవులు
ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు ?
కాంగ్రెస్: 70 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ , 30 సీట్లలో తీవ్ర పోటీ

తెలంగణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేయడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం చాలా కసరత్తు చేసి చివరకు ఈ రోజు 55 మందితో కూడిన తొలి లిస్ట్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రిలీజ్ చేశారు.
అందులో ఈ మధ్యే బీఆరెస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిన మైన౦పల్లి హన్మంత రావు, ఆయన కుమారుడు రోహిత్ లకు చోటు దక్కింది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతిలకు కూడా టికట్ దక్కింది. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన జూపల్లి కృష్ణారావుకు కొల్లపూర్ టికట్, కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి టికట్ లభించింది.

ఇక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి బరిలోకి దిగుతుండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, ఆందోల్ (ఎస్సీ) నుంచి మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ, మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బరిలోకి దిగుతున్నారు. సీతక్క తన సొంత నియోజకవర్గమైన ములుగు నుంచి పోటీ పడుతున్నారు.

కాగా, ఫస్ట్ లిస్ట్ లో ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం నేతలు తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. వారు పోటీ చేసే స్థానాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రానట్టు సమాచారం ఇద్దరు నేతలు పాలేరు నుంచి పోటీ చేస్తామని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

వీరే కాకుండా మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ ల పేర్లు కూడా పార్టీ రిలీజ్ చేసిన జాబీతాలో లేక పోవడంతో వారి అనుచరుల్లో కలక‌లం రేగుతోంది.

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పూర్తి లిస్ట్: