HomeTelangana

‘గ్రూప్స్’ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మ‌హత్య..అర్దరాత్రి హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన‌

‘గ్రూప్స్’ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మ‌హత్య..అర్దరాత్రి హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన‌

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఓ హాస్టల్ లో ఉంటున్న ఎం. ప్రవళిక అనే 23 ఏళ్ళ విద్యా

హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్
మహిళా విద్యార్థులకు ఎమ్మెల్సీ కవిత కుమారుల చేయూత.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఓ హాస్టల్ లో ఉంటున్న ఎం. ప్రవళిక అనే 23 ఏళ్ళ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రూ పరీక్షలు వాయిదా పడుతుండటంతో విరక్తి చెంది ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ వేలాది మంది విద్తార్థులు నిన్న అర్ద రాత్రి రోడ్డెక్కారు.

ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి వందలాది మంది విద్యార్థులు ఆమె మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి పెద్దఎత్తున నిరసన చేపట్టారు.

బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ నేత అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కూడా నిరసనకు దిగడంతో నగరం నడిబొడ్డున ఉద్రిక్తత నెలకొంది.

ప్రశ్నాపత్రం లీక్, బంగ్లింగ్ కారణంగా TSPSC పదేపదే పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యారని వారు ఆరోపించారు.

ఉద్రిక్తత పెరగడంతో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేందుకు అనుమతి నిరాకరించారు.

దా‍ంతో కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

ప్రవళిక మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన వరంగల్‌కు తరలించారు.

విద్యార్థి ఆత్మహత్యను ప్రభుత్వం హత్యగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడం వల్లే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు.పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.

కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలు శనివారం పిలుపునిచ్చిన ‘సడక్ బంద్’ నిరసనలో పాల్గొనాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు.

కాగా ప్రవళిక ఆత్మహత్యకు గ్రూప్ పరీక్షల రద్దు, వాయిదాలకు ఎలాంటి సంబందం లేదని పోలీసులు ప్రకటించారు. ప్రేమ విఫ‌లమైనందునే ఆమె ఆత్మహత్య చేసుకుందని చిక్కడపల్లి ACP యాదగిరి తెలిపారు. ప్రవళిక బాయ్ ఫ్రెండ్ ఆమెను మోసం చేసి మరొక అమ్మాయితో పెళ్ళికి సిద్దమవడం వల్లనే ఆమె ఆత్మహత్యచేసుందని ఆయన అన్నారు.

నిరసనకు నాయకత్వం వహించిన నిరసనకారులు ఎన్నికల ఎన్నికల‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు, తప్పుడు ఎజెండాలను వ్యాప్తి చేసినందుకు, అసత్యపు ప్రసంగాలు చేసినందుకు చర్యలు తీసుకుంటామన్నారు.