మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు జనగామ టికట్ ఇచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్
మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు జనగామ టికట్ ఇచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జనగాం కాంగ్రెస్ టికట్ ను కొమ్మూరి ప్రతాపరెడ్డికి ఇవ్వాలనే నిర్ణయం జరిగినందున లక్ష్మయ్య తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఈ లేకలో ఆయన తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై తీవ్ర విమర్శలు చేశారు. అత్యంత సీనియర్ నాయకుడునైన తీవ్ర అవమానం జరుగుతోందని, రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక పార్టీ ఒక వ్యాపార సంస్థగా మారిపోయిందని, డబ్బులే ప్రధానమయ్యాయని, కనీసం తన లాంటి వారిని పలకరించే నాయకుడు లేకుండా పోయాడని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాలను అధిష్టానంతో మాట్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని, అయితే తనతో ఒక్క నిమిషం కూడా మాట్లాడటానికి తనకు సమయం ఇవ్వలేదని పొన్నాల అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కొనసాగడం అసాధ్యమని తేలిపోయిందని పొన్నాల అన్నారు. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
కాగా, పొన్నాల భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ రోజు ఆయన కేసీఆర్ ను కలిసి గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం.