HomeNationalCinema

నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే

నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే

తమకు సేవచేస్తాడని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయనేమో నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాడు. ఇందులో పాల్గొంటే 100

టెక్ కంపెనీ MD, CEOలను నరికి చ‍ంపిన మాజీ ఉద్యోగి
టమాటా దొంగల భయంతో వణికిపోతున్న రైతులు
మీ పిలుపు కోసం నిలువెల్ల చెవులై… కేసీఆర్ ను ఒదిలేసినట్టేనా ?

తమకు సేవచేస్తాడని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయనేమో నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాడు. ఇందులో పాల్గొంటే 100 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లోనే ఉండాలి. బైటికి వెళ్ళడానికి వీలు లేదు.

కర్నాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఈ రోజు కన్నడ ఛానల్ కలర్స్ లో మొదలైన బిగ్ బాస్ షో లో ప్రవేశించాడు. బాజా బజంత్రీలతో , డ్రమ్స్ బీట్స్ మధ్య ఆయన బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించాడు. బిగ్ బాస్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది అని ఆ ఎమ్మెల్యే అన్నాడు.

కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడిపే ప్రదీప్ ఈశ్వర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి కె. సుధాకర్‌కు షాక్ ఇచ్చి ఆయనపై గెలుపు సాధించాడు.

ఈ ఎమ్మెల్యే బిగ్ బాస్ షోలో పాల్గొనడం పై సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. ”#BigBossKannadaలోకి ప్రవేశించిన చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్‌పై చర్య తీసుకోండి. ప్రజలు అతని సేవ కోసం ఎన్నుకున్నారు, అతను ఎంత బాధ్యతారహితంగా ఉన్నాడు, ” అని గజానంద్ మోల్కెరే అనే నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన పోస్ట్ ను ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను ట్యాగ్ చేశారు.

షోలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాన్ని అభిషేక్ అనే మరో యూజర్ తీవ్రంగా విమర్శించాడు. “మేము పన్నులు చెల్లిస్తాము, మీరు జీతం , అలవెన్సులు తీసుకుంటారు. ప్రజలను వదిలేసి రియాలిటీ షోలకు వెళతారు. ప్రజా ప్రతినిధులు ఎలా పని చేస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తోంది ”అని అతను కామెంట్ చేశాడు.

ఈశ్వర్‌పై జెడి(ఎస్) అభ్యర్థిగా పోటీ చేసిన కెపి బచ్చెగౌడ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ “ఇది అతని వ్యక్తిగత సమస్య”. “నా సమాచారం ప్రకారం, అతను షోలో ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే నిష్క్రమిస్తాడు. ఆయన నియోజకవర్గంలో పని చేస్తున్నారు. అతనికి అవకాశం ఇద్దాం. దాని గురించి ఇప్పుడు వ్యాఖ్యానించడం సరికాదు’ అని అన్నారు.

కలర్స్ కన్నడ ఛానెల్ వర్గాల సమాచారం ప్రకారం, షోలో పాల్గొనేవారు 100 రోజుల పాటు బయటి ప్రపంచంతో సన్నిహితంగా ఉండకుండా బిగ్ బాస్ ఇంట్లోనే ఉండేలా ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది.