HomeTelanganaPolitics

తెలంగాణలో హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా ?

తెలంగాణలో హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా ?

తెలంగాణ రాజకీయ వాతావరణం వేడి మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి రావడంతో రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అయితే రేగుతున్న ఈ దు

ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం బిల్లు ఆమోదించిన అసెంబ్లీ
తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన – ఆగిన‌ బస్సులు
50 వేల మెజార్టీ రాకుంటే పార్టీకి రాజీనామా చేస్తా!

తెలంగాణ రాజకీయ వాతావరణం వేడి మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి రావడంతో రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అయితే రేగుతున్న ఈ దుమ్ముతో పాటు కొన్ని కొత్త విషయాలు బైటికి వస్తున్నాయి. వాటిలోని నిజానిజాలని కాలమే బహిర్గతం చేస్తుంది కానీ ప్రస్తుతం వాటిపై చర్చ మాత్రం తీవ్రంగానే సాగుతున్నది.

నిజామాబాద్ లో జరిగిన బీజెపి బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ బైటపెట్టిన విషయాలు, నిన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడిన మాటలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆ మాటలు బీఆరెస్, బీజేపీలకు రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించే అవకాశం కనపడుతున్నది.

నిజామాబాద్ లో నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ”ఇంతకుముందు చెప్పని రహస్యం ఇవాళ చెబుతున్నాను, GHMC ఎన్నికల తర్వ్ఫాత కేసీఆర్ నన్ను కలిసి ఎన్డీయేలో చేరుతానని చెప్పారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. అయితే ఇది రాజరికం కాదని, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పాను. ” అని మోడీ అన్నారు.

మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ సంచలనాన్ని సృష్టించాయి. మోడీ మాటలను ఆయుధంగా చేసుకున్న కాంగ్రెస్ బీఆరెస్, బీజేపీల మధ్య రహస్య బంధం ఉందని తాము చాలా కాలంగా చెప్తున్న మాటలు నిజమే అని రుజువయ్యాయని కామెంట్ చేసింది. మోడీ వ్యాఖ్యలను ఖండించడానికి బీఆరెస్ నాయకులు చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఇంతలోనే హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మరో బాంబు పేల్చారు. బీజేపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎవ్వరికీ పూర్తి మెజార్టీ రాదని, హంగ్ ఏర్పడుతుందని చెప్పారు. అంతే కాదు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. సంతోష్ మాట్లాడిన ఈ మాటలతో మళ్ళీ బీజేపీ, బీఆరెస్ బంధంపైనే చర్చలు ప్రారంభమయ్యాయి.

ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీ ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీజేపీ కాక తెలంగాణలో సీట్లు సంపాదించుకునే పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లు మాత్రమే. కాంగ్రెస్ తో బీజేపీ చేతులు కలపబోదు. ఇక మిగిలింది బీఆరెస్. అంటే సంతోష్ చెప్పిన దాన్ని బట్టి బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయా ? ఒకవేళ అది ముందే డిసైడ్ అయిపోయినట్టైతే బీఆరెస్, బీజేపీల మధ్య చాలాకాలంగా బధం ఉందన్న విషయం కూడా నిజమేనా ?

రాజకీయ పక్షాలు బైటికి చెప్పే మాటలు ఆచరణలో చేసే పనులు ఒకటి కావన్నది పచ్చి నిజం. బీజేపీతో తమకే సంబంధం లేదంటూ బీఆరెస్ చెప్తున్న దాంట్లో నిజమెంత అన్నది చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అర్దం కాదు.

ఇక మోడీ మాటలతో కాంగ్రెస్ కు ఒక ఆయుధం అందగా, ఇప్పుడు సంతోష్ మాటలతో ఆ పార్టీకి మరో అయుధం అందినట్టే. హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు ప్రారంభించారు.