HomeInternational

కైలాస దేశంలో నటి రంజిత చిచ్చు…ప్రధానిగా రంజితను వ్యతిరేకిస్తున్న నిత్యానంద శిష్యగణం

కైలాస దేశంలో నటి రంజిత చిచ్చు…ప్రధానిగా రంజితను వ్యతిరేకిస్తున్న నిత్యానంద శిష్యగణం

తన శిష్యులతో సహా భారతదేశం వదిలి పారిపోయిన‌ వివాదాస్పద స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద ఈక్వెడార్ ప్రాంతంలో ఓ ద్వీపాన్ని కొని దాన్ని కైలాస దేశంగా

బీఆర్ఎస్ ఖమ్మం పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు అరెస్ట్
పోటీ చేయకుండా అజారుద్దీన్ పై అనర్హత వేటు
న్యూ ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు

తన శిష్యులతో సహా భారతదేశం వదిలి పారిపోయిన‌ వివాదాస్పద స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద ఈక్వెడార్ ప్రాంతంలో ఓ ద్వీపాన్ని కొని దాన్ని కైలాస దేశంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఆయన అనుంగు శిష్యురాలు మాజీ నటి రంజితను ఈ మధ్య కాలంలో నియమించిన విషయం కూడా తెలిసిందే. అయితే రంజిత ప్రధాని అయిన తర్వాత ఆమె ప్రవర్తన నిత్యానంద శిష్యుల్లో వ్యతిరేకతకు దారితీసినట్టు తెలుస్తోంది.

రంజిత ప్రధాని అయిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, తానే ఆ దేశాధ్యక్షురాలైనట్టు ప్రవర్తిస్తున్నదని, అన్ని అధికారలను తానే దారాదత్తం చేసుకుందని, అంతే కాకుండా శిష్యబృందాన్ని బెదిరిస్తూ కైలాస దేశంలోని సంస్థలను తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నుతోందని నిత్యానంద శిష్యులు శిష్యులు ఆరోపిస్తున్నారు. నిత్యానందతో పోటీపడేలా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఆ వీడియోలను కైలాస దేశం వెబ్‌సైట్‌లో రంజిత పెట్టేవారు. దీనిపై కూడా నిత్యానంద శిష్యులు మండిపడుతున్నారు.

తనకు అత్యంత సన్నిహితురాలైన రంజిత వ్యవహారం ఇప్పుడు నిత్యానందకు ఇబ్బందులు కలిగిస్తోందట. మిగతా శిష్యులంతా ఒకవైపు, రంజిత ఒక్కరే ఒకవైపు అన్నట్టు పరిస్థితి తయారయ్యిందట. ఈ పరిస్థితుల్లో రంజితకు పూర్తిగా మద్దతు తెలిపితే తన పీఠానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని అర్దమైన నిత్యానంద రంజిత అధికారాలను కట్ చేశారని తెలుస్తోంది. కైలాస దేశం వెబ్ సైట్ నుంచి రంజిత ప్రసంగాల వీడియోలన్నింటినీ డిలీట్ చేశారు. అయితే ఆమెను నొప్పించకుండా అదుపుచేయడం ఎలా అన్న విషయం అర్దంకాక నిత్యానందకూడా తలపట్టుకుంటున్నారట.