HomeTelanganaPolitics

తెలంగాణకు ఇచ్చిన హామీలేమయ్యాయి – మోడీకి కేటీఆర్ సూటి ప్రశ్న‌

తెలంగాణకు ఇచ్చిన హామీలేమయ్యాయి – మోడీకి కేటీఆర్ సూటి ప్రశ్న‌

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆయనపై సూటి ప్రశ్నలు సంధించార

కేటీఆర్ కు రేవంత్ రెడ్డి, బహిరంగ లేఖ
కేటీఆర్, కవితలపై గవర్న‌ర్ కు లేఖరాసిన సుఖేశ్ చంద్రశేఖర్… వాడో క్రిమినల్, ఫ్రాడ్ అని కేటీఆర్ మండిపాటు
ఉచిత విధ్యుత్తు: రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ముసలం … అలా చెప్పడానికి రేవంత్ స్థాయి ఏంటని మండిపడ్డ కోమటి రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆయనపై సూటి ప్రశ్నలు సంధించారు.

విభజన హామీల్లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ (పిఆర్‌ఎల్‌ఐ)కి జాతీయ హోదా సహా హామీలను ఏం చేశారని KTR ప్రశ్నించారు. ఆ హామీలను తక్షణం నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ మూడు వాగ్దానాలను నెరవేర్చడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైతే, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని KTR అన్నారు.
నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీPrime Minister Narendra Modi రాష్ట్రానికి వస్తున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ పర్యటన తర్వాత మూడు రోజుల వ్యవధిలో ఆయన రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి.

ప్రధానమంత్రిపై విరుచుకుపడిన కేటీఆర్ , గత పదేళ్ల నుంచి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ BJP ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు.

“ఎంతకాలం అబద్ధాలు కొనసాగిస్తావు, తెలంగాణ కష్టాలు ఎప్పుడు తీరుతాయి. మీ హృదయం గుజరాత్‌తో నిండిపోయింది. తెలంగాణ గుండెల్లో గునపాలు దించుతున్నారు” అని KTR ట్వీట్ చేశారు.

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటును పక్కనబెట్టారని, యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్‌ ప్రతిపాదనను పక్కనబెట్టారని మండిపడ్డారు.

‘‘మన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా మంజూరు చేస్తామన్న హామీ తుంగలో తొక్కింది. పాలమూరుకు దశాబ్దాలుగా ద్రోహం చేసి మళ్లీ పాలమూరును నాశ్నం చేస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.

కేంద్రంలోని పదేళ్ల బీజేపీ పాలనలో కేవలం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలే కాదు 140 కోట్ల మంది భారతీయులకు ద్రోహం చేశారని కేటీఆర్ ఆరోపించారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అందరికీ ఇళ్లు, యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

“నీ మిత్రునికి ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేరుస్తావా లేక దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తావా” అని కేటీఆర్ మోడీ ని ప్రశ్నించారు.

తెలంగాణలో నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని చేసిన ప్రకటన మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటిదని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో చాలా హైప్ క్రియేట్ చేసినా అమలుపై స్పష్టత లేదన్నారు.

“ప్రధానమంత్రిగా మీ పదేళ్ల పాలనలో, అదానీకి తప్ప, సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు లభించాయి?” అని కేటీఆర్ మోడీని సూటిగా ప్రశ్నించారు.