HomeTelanganaPolitics

తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ

తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన(Janasena) పార్టీ 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు పోటీచేసే స్థానాల జాబ

వైసీపీకి షాక్ ఇచ్చిన ముద్రగడ పద్మనాభం
నాకు ముఖ్యమంత్రి కావడం కన్నా జగన్ ఓడిపోవడమే ముఖ్యం… స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
మహిళల హక్కులంటూ గొంతుచించుకుంటున్న ఫేక్ లీడర్లను నమ్మొద్దు: పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ పరోక్ష వ్యాఖ్యలు

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన(Janasena) పార్టీ 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు పోటీచేసే స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం విడుదల ఆ పార్టీ విడుదల‌ చేసింది.

సనత్‌నగర్, ఎల్బీనగర్‌,కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి,కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్‌, పటాన్‌చెరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలేరు, ఇల్లందు, మధిర, మునుగోడు, నకిరేకల్‌, హుజూర్‌నగర్,కోదాడ, నర్సంపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌,వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, మంథని, ఖానాపూర్‌,నాగర్‌కర్నూల్ తదితర స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన జాబితా చూస్తే అర్థమవుతోంది. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ స్థానాల్లో పోటీ పడనుంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పార్టీ ఉపాధ్యక్షులు స్పష్టం చేశారు.