తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సాగిన వార్ చల్లబడిందని ఇద్దరూ దగ్గరయ్యారని అనుకుంటున్న సమయంలో గవర్నర్ కేసీఆర్ కు షాక్ ఇచ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సాగిన వార్ చల్లబడిందని ఇద్దరూ దగ్గరయ్యారని అనుకుంటున్న సమయంలో గవర్నర్ కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. ఈ మధ్యే బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేయగా ఆ సిఫార్సునుగవర్నర్ తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణలను ప్రతిపాదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించింది.
అయితే, ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తిరస్కరించిన గవర్నర్, దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణలు రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా ఆధారాలు లేవన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని ఆమె సూచించారు.
మళ్ళీ మన నినాదం వెబ్ సైట్, అడ్మిన్ ప్యానెల్ రెండూ ‘అకౌంట్ సస్పెండెడ్’ అని వస్తున్నాయి
అకౌంట్ ను హోస్టింగ్ చేస్తున్న శ్రీధర్ మన అకౌంట్ ను ఆపడం కానీ, లేదంటే అక్కడ ఏదైనా సమస్య వచ్చి కానీ ఉంటుంది. చెక్ చేయగలవు
వెబ్ సైట్, అడ్మిన్ ప్యానెల్ రెండూ కూడా అకౌంట్ సస్పెండెడ్ అని వస్తున్నాయి