HomeInternational

ప్రపంచం మీద దాడి చేయబోతున్న మరో వైరస్…5 కోట్ల మంది చనిపోతారని అంచనా

ప్రపంచం మీద దాడి చేయబోతున్న మరో వైరస్…5 కోట్ల మంది చనిపోతారని అంచనా

రెండేళ్ళపాటు ప్రపంచాన్ని వణికించి, ఇప్పటికీ ప్రజలను భయపెడుతున్న కరోనా మహమ్మారిని మర్చిపోకముందే ప్రపంచంపైఉ మరో వైరస్ దాడి చేయబోతుందనే వార్తలు భయబ్రాంత

కైలాస దేశంలో నటి రంజిత చిచ్చు…ప్రధానిగా రంజితను వ్యతిరేకిస్తున్న నిత్యానంద శిష్యగణం
ఈక్వెడార్‌లో టీవీ న్యూస్‌ ఛానల్‌పై దుండగుల దాడి – లైవ్ లో ప్రసారం
అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌

రెండేళ్ళపాటు ప్రపంచాన్ని వణికించి, ఇప్పటికీ ప్రజలను భయపెడుతున్న కరోనా మహమ్మారిని మర్చిపోకముందే ప్రపంచంపైఉ మరో వైరస్ దాడి చేయబోతుందనే వార్తలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. డిసీజ్ ఎక్స్ అనే వైరస్ త్వరలో ప్రపంచంపై దాడి చేయనుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా అనధికార అంచనాలు మాత్రం 2 కోట్ల మంది మరణించినట్టు చెప్తున్నాయి. కాగా త్వరలో రాబోయే డిసీజ్ ఎక్స్ వైరస్ వల్ల 5 కోట్ల మంది చనిపోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

బ్రిటన్ టీకాల టాస్క్ ఫోర్స్ కు అధ్యక్షురాలిగా పనిచేసిన డేమ్ కేట్ బింగహామ్, బోఫిన్ టిమ్ హేమ్స్‌తో కలిసి రచించిన పుస్తకంలో కొత్తగా రాబోయే వైరస్ ల గురి౦చి హెచ్చరించారు. ఈ పుస్తకానికి సంబంధించి డైలీ మెయిల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం

గతంలో స్పానిష్ ఫ్లూ వల్ల చనిపోయిన వారికన్నా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

“1918-19 ఫ్లూ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కనీసం 5 కోట్ల‌ మందిని చంపింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి కంటే రెండు రెట్లు ఎక్కువ” అని వారు చెప్పారు.
“ఈరోజు, ఇప్పటికే ఉనికిలో ఉన్న అనేక వైరస్‌లలో ఒకదాని నుండి ఇంతకన్నా పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉంది. మన గ్రహం మీద ఉన్న అన్ని ఇతర జీవుల కంటే చాలా వైరస్‌లు స్పీడ్ గా పునరావృతం, పరివర్తన చెందుతాయి. అవన్నీ మానవులకు ముప్పు కలిగించకపోవచ్చు కానీ అందులో కొన్ని మానవాళీకి తీవ్ర ముప్పునుకలిగించనున్నాయి.” అని ఆ పుస్తక రచయితలు చెప్పారు.

“ఇప్పటివరకు, శాస్త్రవేత్తలకు 25 వైరస్ కుటుంబాల గురించి తెలుసు. వాటిలో ప్రతి ఒక్కటి వందల, వేల వేర్వేరు వైరస్‌లను వ్యాపింపజేస్తాయి. అయితే వీటిలో ఏదైనా ఒక వైరస్ పెద్ద ఎత్తున మహమ్మారిని సృష్టిస్తుంది” అని బింగ్‌హామ్ , హేమ్స్ చెప్పారు.

మేలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా తదుపరి మహమ్మారి “డిసీజ్ X, ప్రపంచవ్యాప్తంగా పెంచే ముప్పు గురించి హెచ్చరించింది.

”కరోనా వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకోగలిగారు కానీ రాబోయే వైరస్ మహమ్మారిని సులభంగా నియంత్రించలేము.” అని నిపుణులు చెప్తున్నారు