HomeTelanganaPolitics

కాంగ్రెస్ లోకి మైనంపల్లి హనుమంత రావు

కాంగ్రెస్ లోకి మైనంపల్లి హనుమంత రావు

బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన ఆ పార్టీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నెల 27న తాను ఢిల్ల

KCRతో తన రహస్య భేటీ గురించి బైటపెట్టి మోడీ కాంగ్రెస్ కు ఆయుధమిచ్చారా ?
మాజీ నక్సలైటు సీతక్కపై పోటీకి మరణించిన నక్సలైటు కూతురును దింపిన కేసీఆర్
‘జగ్గారెడ్డిని బీఆరెస్ లోకి తీసుకొస్తా’

బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన ఆ పార్టీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నెల 27న తాను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆయన చెప్పారు.
ఈ రోజు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహతో సహా కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని కలిసిన తర్వాత తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ…

‘నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. వారు ఉదయం నాకు ఫోన్ చేశారు. నేను వారిని సంతోషంగా స్వాగతించాను, ”అని మైనంపల్లి చెప్పారు.

అయితే, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హనుమంతరావు కుమారుడికి టిక్కెట్టు ఇచ్చే విషయంలో ప్రతినిధి బృందం ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచార‍ం.

బీఆర్‌ఎస్‌ పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదని ఆరోపిస్తూ హనుమంతరావు ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాజీనామా లేఖ పంపారు.

కాగా మైనంపల్లి వెంట అధికార పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి వెళ్తారని చెబుతున్నారు. మెదక్‌, ఇతర ప్రాంతాల్లోని కొందరు కౌన్సిలర్లు, సర్పంచ్‌లూ ఈ జాబితాలో ఉండే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గంలోని నలుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మైనంపల్లి వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఉప్పల్‌ నియోజకవర్గంలోని ఓ కార్పొరేటర్‌ కూడా హనుమంతరావుకు సన్నిహితుడు.