ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత దానికి పెద్ద పరీక్షగా భావించిన ఎన్నికల్లో ఇండియా కూటమి పై చేసి సాధించింది. దేశంలోని 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్
ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత దానికి పెద్ద పరీక్షగా భావించిన ఎన్నికల్లో ఇండియా కూటమి పై చేసి సాధించింది. దేశంలోని 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఈ నెల 5న నిర్వహించారు. నేడు ఓట్ల లెక్కింపు జరగ్గా… బీజేపీ 3, విపక్షాలు 4 స్థానాల్లో విజయం సాధించాయి. INDIA కూటమిగా ఏర్పడ్డాక విపక్షాలకు లభించిన ఈ విజయాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
త్రిపురలోని ధన్‌పూర్, ఉత్తరాఖండ్‌లోని బాగేస్‌వర్ అసెంబ్లీ స్థానాల నుండి బిజెపి అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, జార్ఖండ్‌లోని డుమ్రీ, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధుప్‌గురిలో విజయం సాధించింది.