HomeTelanganaCrime

హింసను ప్రోత్సహించే సినిమాలను, టీవీ ఛానల్ ల‌ను సాహిత్యాన్ని నిషేదిస్తే తప్ప ఈ ఘాతుకాలు ఆగవు

హింసను ప్రోత్సహించే సినిమాలను, టీవీ ఛానల్ ల‌ను సాహిత్యాన్ని నిషేదిస్తే తప్ప ఈ ఘాతుకాలు ఆగవు

ప్రేమోన్మాది ఘాతుకం సంఘటన అనేకసార్లు జరిగినట్టుగానే మళ్లీ జరిగింది. నేటి ఉన్మాది శివకుమార్ కావచ్చు లేదా మరో వ్యక్తి కావచ్చు. అలాగే దాడికి గురైంది సంఘ

ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు
కాసేపట్లో మీడియా ఎదుటకు దీప్తి సోదరి చందన
టెక్ కంపెనీ MD, CEOలను నరికి చ‍ంపిన మాజీ ఉద్యోగి

ప్రేమోన్మాది ఘాతుకం సంఘటన అనేకసార్లు జరిగినట్టుగానే మళ్లీ జరిగింది. నేటి ఉన్మాది శివకుమార్ కావచ్చు లేదా మరో వ్యక్తి కావచ్చు. అలాగే దాడికి గురైంది సంఘవి కావచ్చు ,చనిపోయిన ప్రణీత కావచ్చు మరే మహిళ అయినా కావచ్చు. ఈ సంఘటనలో అడ్డుపడ్డ సంఘవి తమ్ముడు కూడా చనిపోవడంతో మహిళలు తీవ్ర అబద్ర తకు గురి కావలసి వస్తుంది . నేటి సామ్రాజ్యవాద సంస్కృతి వల్ల ప్రేమ ఉన్మాదులను తయారు చేస్తుంది. నిజమైన ప్రేమ మనిషి ఇష్టాయిష్టాలను గౌరవిస్తుంది ,సమానంగా చూస్తుంది. ఇలా మనిషినే చంపాలని చూడదు. ప్రేమికురాలిని తన సొంత ఆస్తిగా తనకే దక్కాలనే విష సంస్కృతే దీనికి కారణం.. మహిళను వ్యక్తిత్వం లేని దానిగా కేవలం విలాస వస్తువుగా భావించే సామ్రాజ్యవాద సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలే ఈ హత్యలు జరగడానికి కారణం. ప్రేమికుడిగా నటించిన వాడు ఉన్మాదిగా మారడానికి తగిన పరిస్థితులు ఈ పురుషాధిక్య సమాజంలో పుష్కలంగా ఉన్నాయి. ఏ సినిమా చూసినా చాలా క్రూరంగా నరుక్కునే చంపుకునే విచ్చలవిడి హింసతో రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. హీరో ప్రేమిస్తే చాలు , హీరోయిన్ తిరిగి ప్రేమించేదాకా సతాయిస్తాడు ,ఇదంతా కామెడీగా నడుస్తుంది .చంపేయడం ఎలా అని ఉగ్గుపాలతోనే బుర్రలోకి ఎక్కించే పుట్లకొద్ది కొత్త కొత్త వీడియో గేమ్ ల మత్తులో యువత మగ్గిపోతున్నారు. ప్రభుత్వం పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుంది.. వారి లాభాల కోసమే ఇదంతా జరుగుతుంది. మహిళలను మనుషులుగా చూడలేని శివ కుమారులు ఈ పరిస్థితుల్లో తయారు కాకుండా ఎలా ఉంటారు. ఈ పరిస్థితులను ఆహ్వానించి ,అరికట్టలేని ,అలాగే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించని పాలకులనిర్లక్ష్యానిది అసలు కారణం..
శివకుమార్ అరెస్టుతో పాటు ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తీవ్రమైన హింసను ప్రోత్సహించే సినిమాలను, టీవీ ఛానల్ ను సాహిత్యాన్ని ప్రభుత్వం వెంటనే నిషేదించాలి..
సుప్రీంకోర్టు సూచన ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఫోర్న్ వెబ్సైటును కట్టడి చేయాలి..
బి. జ్యోతి…కన్వీనర్,
శ్రీదేవి, రాధా… కో కన్వీనర్స్,
చైతన్య మహిళా సంఘం..