హిందూ సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తో సహా ఇతర హిందుత్వ సంస్థలు మండిపడుతున్నాయి. సనాతన ధర్మం మలేరియా, డెంగ్య
హిందూ సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తో సహా ఇతర హిందుత్వ సంస్థలు మండిపడుతున్నాయి. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా వంటిదని, దాన్ని వ్యతిరేకించడంతో ఊరుకోకూడదని దానిని నిర్మూలించాలని ఆయన ఓ సభలో వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై ఢిల్లీలో వినీత్ జింధాల్ అనే ఓ లాయర్ కేసు కూడా నమోదు చేశారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ బీజేపీ నేతలు తమిళనాడు గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
మరో వైపు ఉదయనిధికి మద్దతుగా అనేక మంది నెటిజనులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉదయనిధి తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఉదయనిధి అన్న మాటల్లో ఒక్క ముక్క కూడా తప్పులేదని , ఆయన వంద శాతం నిజమే మాట్లాడారని స్పష్టం చేశారు. బీజేపీ తన వైఫల్యాలనుంచి తప్పించుకోవడం కోసం మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు.
మరో వైపు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉదయనిధి స్టాలిన్ కు మద్దతుగా నిల్చారు. సనాతన పార్లమెంటు ఇలా ఉంటుందంటూ సన్యాసులు, స్వామీజీల ఫోటోలను పోస్ట్ చేశారు.
Back to the Future ..a #Tanathani parliament.. dear CITIZENS are you okay with this… #justasking pic.twitter.com/N57FU1Q5gi
— Prakash Raj (@prakashraaj) September 4, 2023