రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏడవ సీజన్ ఆదివారం ప్రారంభమైంది. తెలుగు సూపర్ స్టార్ నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న బి
రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏడవ సీజన్ ఆదివారం ప్రారంభమైంది. తెలుగు సూపర్ స్టార్ నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 7లో ప్రియాంక జైన్, శివాజీ, దామిని భట్ల, ప్రిన్స్ యావర్, షకీల, ఆట సందీప్, శోభా శెట్టి, శుభశ్రీ రాయగురు, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, రాతికా రోజ్, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. అమర్‌దీప్ చౌదరి పోటీదారులుగా ఉన్నారు.
వీక్షకులు సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, శనివారం,ఆదివారం రాత్రి 9 గంటలకు షోను చూడటానికి ‘స్టార్ మా’ని ట్యూన్ చేయవచ్చు. బిగ్ బాస్ తెలుగు 7 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. దేవరకొండ తన తాజా చిత్రం ఖుషిని ప్రమోట్ చేయడానికి ఈ రియాల్టీ షోకి హాజరయ్యారు. హోస్ట్ నాగార్జున తన మాజీ కోడలు, ఖుషి స్టార్ సమంతా రూత్ ప్రభు గురించి అడిగినప్పుడు, ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి యుఎస్‌లో ఉన్నారని విజయ్ వెల్లడించారు. త్వరలో భారతదేశంలో జరిగే ప్రచార కార్యక్రమాలలో సమంత పాల్గొనగలదని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
నవీన్ పోలిశెట్టి తన రాబోయే చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని ప్రమోట్ చేయడానికి వేదికపైకి వచ్చారు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి కామిక్ టచ్ జోడించారు.
ప్రియాంక జైన్:
తను తెలుగుమ్మాయి కాదు.. కానీ ‘మౌనరాగం’ అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. మొదటి సీరియల్‌తోనే అందరినీ ఆకట్టుకున్న ప్రియాంక జైన్.. మెల్లమెల్లగా తెలుగు సీరియల్స్‌లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోయింది. చాలామంది బుల్లితెర ప్రేక్షకులు, సీరియల్ లవర్స్.. ప్రియాంకను తమ పక్కింటి అమ్మాయిగా భావిస్తారు. తెలుగుతో పాటు పలు కన్నడ సీరియల్స్‌లో కూడా హీరోయిన్‌గా నటించింది ప్రియాంక జైన్.
టేస్టీ తేజ:
ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఎవరో ఒక యూట్యూబర్ ఉండడం ఆనవాయితీ. అలాగే ఈసారి యూట్యూబర్ కేటగిరి నుండి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవుతున్నాడు టేస్టీ తేజ. ఈరోజుల్లో సినిమా ప్రమోషన్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా తనతో పాటు ఫుడ్‌ను టేస్ట్ చేయిస్తూ సినిమా ప్రమోషన్స్‌కు కొత్త రకమైన కాన్సెప్ట్‌ను అందించాడు టేస్టీ తేజ. ముందుగా జబర్దస్త్‌తో కామెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తేజ.. ప్రస్తుతం టేస్టీ తేజగా ఫేమస్ అయిపోయాడు.
అమర్‌దీప్ చౌదరీ:
అమర్‌దీప్.. చాలాకాలం ముందే సీరియల్స్‌లో ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. మెల్లగా హీరోగా ఎదిగాడు. కానీ స్టార్ మాలో హీరోగా చేసిన సీరియల్స్ అమర్‌దీప్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రియాంక జైన్‌తో అమర్‌దీప్ కెమిస్ట్రీ బాగుంటుందని బుల్లితెర ప్రేక్షకులు ఫీలవుతుంటారు. అసలైతే వీరి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా అమర్‌దీప్.. మరో సీరియల్ నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్నాడు.
శివాజీ:
ఒకప్పుడు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ. ఆ తర్వాత పెరుగుతున్న పోటీ మధ్య తనకు హీరోగా అవకాశాలు రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్.. ఇలా ఎలాంటి అవకాశాలు వచ్చినా ఒప్పుకున్నాడు. కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు శివాజీ. దీంతో తన చుట్టూ పలు కాంట్రవర్సీలు కూడా క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 47 ఏళ్ల హీరో బిగ్ బాస్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.
షకీలా:
ఒకప్పుడు షకీలా పేరు చెప్తే ఇండియా అంతా ఒక ఊపు ఊగిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో చాలా బోల్డ్‌గా నటించిన హీరోయిన్స్‌ను వేళ్లపైన లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో షకీలా కూడా ఒకరు. ఎవరు ఏమంటున్నారు అని పట్టించుకోకుండా షకీలా అడల్ట్ సినిమాల్లో బోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అప్పటి యూత్‌ను తనవైపు తిప్పుకుంది. కేవలం తెలుగు మాత్రమే కాదు మలయాళ, తమిళం, కన్నడ లాంటి ఇతర సౌత్ భాషల్లో కూడా తను బోల్డ్ సినిమాలు చేసింది.
ఆట సందీప్:
ఆట అనే డ్యాన్స్ షో ద్వారా ఎంతోమంది డ్యాన్సర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో సందీప్ కూడా ఒకరు. ఆట షోలో తన పర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండిపోయింది కాబట్టి తన పేరు కూడా ఆట సందీప్‌గా మారిపోయింది. కేవలం డ్యాన్సర్‌గానే కాదు.. నటుడిగా కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు సందీప్. తనకు ఏదైనా నచ్చకపోతే, కోపం వస్తే వెంటనే బదులు చెప్పడం సందీప్ లక్షణం. బిగ్ బాస్‌కు, అది చూసే ప్రేక్షకులకు కూడా ఆట సందీప్ ద్వారా చాలా ఎంటర్‌టైన్మెంట్ లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
కిరణ్ రాథోడ్:
ఒకప్పుడు తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది కిరణ్ రాథోడ్. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కేవలం తమిళంలో మాత్రమే కాదు.. తెలుగు, హిందీలో కూడా హీరోయిన్‌గా గుర్తింపు సాధించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందులో చాలావరకు హిట్ టాక్ అందుకున్నాయి. బాలీవుడ్‌లో సైతం హృతిక్ రోషన్ లాంటి స్టార్‌తో కలిసి నటించింది.
శోభా శెట్టి:
కన్నడలో సీరియల్ నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన శోభా.. తెలుగులోని ‘కార్తికదీపం’ సీరియల్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అంతే కాకుండా ఈ సీరియల్‌లో హీరో, హీరోయిన్‌కు ఎంతగా గుర్తింపు వచ్చిందో విలన్‌గా డాక్టర్ మోనిత పాత్ర చేసిన శోభాకు కూడా అంతే గుర్తింపు లభించింది. ఇప్పటికీ చాలామంది బుల్లితెర ప్రేక్షకులు తనను మోనిత అన్న పేరుతోనే గుర్తుపెట్టుకున్నారు. ‘కార్తికదీపం’లో తన పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.
దామిని భట్ల:
ఈ మె సింగర్ బాహుబలిలో ”పచ్చబొట్టేసినా …” అనే పాటతో ఈమె ఫేమస్ కొండపొలం మూవీలో ధం ధం అనే హిట్ పాటను ఈమే పాడారు.
ప్రిన్స్ యవార్:
ఈయన బాడీ బిల్డర్, మోడల్, పలు సీరియళ్ఌఓ నటించారు.
శుభశ్రీ:
2002 లో చిరంజీవి హీరోగా వచ్చిన రుద్ర వీణ మూవీతో ఈమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఒడిశాలో పుట్టి పెరిగిన ఈ మె క్రీడల్లో చురుకుగా పాల్గొనేవారు. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేశారు.
రతిక:
ఈమె పలు మూవీల్లో హీరోయిన్ గా నటించారు. ఈమె సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కూడా
డాక్టర్ గౌతమ్ కృష్ణ:
ఇతను డాక్టర్ నుంచి యాక్టర్ గా మారాడు. ఆకాశ వీధుల్లో..అనే మూవీలో ఈయన నటించారు.
పల్లవి ప్రశాంత్:
ఈయన యువ రైతు, యూ ట్యూబర్ కూడా యూ ట్యూబ్ లో చాలా ఫేమస్ అయిన ఈయన్ బిగ్ బాస్ లో అడుగుపెట్టాడు.