HomeTelangana

గద్దర్ అన్న యాదిలో సభ ను విజయవంత చేయండి

గద్దర్ అన్న యాదిలో సభ ను విజయవంత చేయండి

•ఉద్యమకారులకు సంక్షేమ పథకాల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి… సెప్టెంబర్ 17 గద్దర్ అన్న యాది లో సంస్మరణ సభకు తరలి రావాలి.. •ఉద్యమకారులు ఏకం కావాలి..

గద్దర్ గురించి చంద్రబాబు అంత కలత చెందాడన్న మాటలు నమ్మొచ్చా ?
గద్దర్ అంతిమ యాత్రలో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీ ఖాన్ మృతి!
గద్దర్ మరణం పట్ల KCR దిగ్భ్రాంతి

•ఉద్యమకారులకు సంక్షేమ పథకాల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి…

  • సెప్టెంబర్ 17 గద్దర్ అన్న యాది లో సంస్మరణ సభకు తరలి రావాలి.. •ఉద్యమకారులు ఏకం కావాలి..

•ఉద్యమకారులను గుర్తించిన రాజకీయపక్షాలకే భవిష్యత్తులో మనుగడ ….

•ఓయు జేఏసి నాయకులు కందుల మధు

కోదాడ: సెప్టెంబర్ 17న కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే గద్దర్ అన్న యాదిలో సంస్మరణ సభకు యువత కదం తొక్కాలని ఓయూ జేఏసీ నాయకులు కందుల మధు పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ పట్టణంలో అతిధి వసతి గృహంలో కోదాడ నియోజకవర్గ ఆరు మండలాల తెలంగాణ ఉద్యమకారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం తొలి దశ నుండి మలిదశ వరకు జీవితాలను త్యాగం చేసిన ఉద్యమకారుల కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించిన రాజకీయపక్షాలకే భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ప్రజా సంఘాలు ఉద్యమకారులను గుర్తించే రాజకీయ పక్షాలు సెప్టెంబర్ 17న జరగబోయే గద్దర్ అన్న యాదిలో సభ లో భాగస్వాములు కావాలన్నారు ఈ సందర్భంగా ఆరు మండలాలకు సన్నాక సభ కార్యక్రమం విజయవంతానికి కమిటీలను నియామకం చేశారు .అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.