పరకాల సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్) :బీఆర్‌ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార
పరకాల సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్) :
బీఆర్‌ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా యువ అధ్యక్షులు లతో పాటు ఆత్మకూరు, నడికూడ మండలాలకు చెందిన పలువురు గులాబి కండువా కప్పుకున్నారు. వారికి ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.అభివృద్ధికి పట్టం కడుతూ నాయకులంతా ఐక్యంగా కలిసి వచ్చారని అన్నారు. అన్ని గ్రామాలు ఇదే స్ఫూర్తితో ఒకే కట్టుపైకి నిలబడి రావాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న అన్ని పథకాలు అందరికి వస్తున్నందున అందరూ ఏకం కావాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఇతర రాష్ట్రాల కు ఆదర్శంగా నిలిచిందన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీ కంటికి రెప్పల కాపాడుకుంతుందన్నారు. గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు.పార్టీలో చేరినవారు:జన్నారపు మహేష్ ( ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షులు)దండు సుధాకర్( నియోజకవర్గ కో ఆర్డినేటర్)కంఠత్మకుర్ అనిల్, నడికూడ యూత్ అధ్యక్షులు.జలుగురి రమేష్ నడికూడ మండల అధ్యక్షులు.చుక్క రవి, అర్షం లక్ష్మి నారాయణ, రాం చరన్, వినయ్, నరేష్, మహేష్, వంశీ కుమార్, కరున్ ప్రసాద్, కృపాకర్, స్టాలిన్, బిష్మచారి,బాల కృష్ణ( పరకాల టౌన్ అధ్యక్షులు)
బిశ్మచారి( కార్యదర్శి)
చుక్క సదయ్య( ప్రధాన కార్యదర్శి)
జన్నరపు కట్టయ్య, సాంబయ్య, అరవింద్, రాజేందర్, రాజయ్య, రాజు, మల్లికార్జున్, రాజు తదితరులు. పార్టీలో చేరడం జరిగింది