దైవ చింతనతో మానసిక ప్రశాంతత..•కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గంగమ్మ తల్లీ ఆశీసులు ప్రతీ ఒక్కరికీ కలగాలి •దైవ చింతనతో మానసిక ప్రశాంతత..•కో
దైవ చింతనతో మానసిక ప్రశాంతత..
•కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
గంగమ్మ తల్లీ ఆశీసులు ప్రతీ ఒక్కరికీ కలగాలి
•దైవ చింతనతో మానసిక ప్రశాంతత..
•కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ,:సంస్కతి సాంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రం నిలయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు .శనివారం నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామంలో గంగమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన మహోత్సవానినికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గుడులను పట్టించుకున్న నాథుడే లేరన్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాంతాలు, వర్గాల వారీగా నిర్మించే ప్రతి దేవాలయానికి ప్రభుత్వ ప్రాధాన్యత లభించింది అన్నారు. మతాలకు అతీతంగా ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడం అనేది తెలంగాణ లో మినహా మరెక్కడా లేదన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు.దేవాలయాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. దేవాలయానికి నిర్మాణానికి తన వంతు సహకారం అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన గీత కార్మికుడు కాలు విరిగి అనారోగ్యంతో బాధపడుతున్న గురుమూర్తిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గొసుల రాజేష్, టిఆర్ఎస్ నాయకులు యాతాకుల మధు బాబు, గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు బండారు గురవయ్య, గ్రామ పెద్దలు, యాదవ సంఘం నాయకులు నాగలక్ష్మి, సైదులు, వెంకన్న, లింగయ్య, నరేష్, శీను తదితరులు పాల్గొన్నారు.