HomeTelanganaCrime

కాసేపట్లో మీడియా ఎదుటకు దీప్తి సోదరి చందన

కాసేపట్లో మీడియా ఎదుటకు దీప్తి సోదరి చందన

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి (25)అనుమానాస్పద మృతికి సంబంధించి వివరాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి. అ

తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
తెల్లవారుజాము నుండే బీఎస్పీ నాయకుల అరెస్టులు…
UP:పెరియార్ జయంతిని జరుపుకున్నందుకు నలుగురిపై కేసు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి (25)అనుమానాస్పద మృతికి సంబంధించి వివరాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి. అనుమానాస్పదంగా మృతి చెందిన దీప్తికి సంబంధించి వివరాలు జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్లో 4 గంటలకు పోలీసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ భాస్కర్ వెల్లడించనున్నారు. కోరుట్ల పట్టణంలోని అలమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన దీప్తి (25) గత నెల 29 న అనుమానస్పదంగా మృతి చెందింది. అక్క చెల్లెలను ఇంట్లో ఉంచి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో జరిగిన వివాహానికి హాజరు, ఆ రాత్రి దీప్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. అయితే ఈ ఘటన అనంతరం అదృశ్యమైన దీప్తి సోదరి చందన కోసం కోరుట్ల పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఆమె కోరుట్ల బస్టాండ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న దృశ్యాలను గమనించిన పోలీసులు అదే కోణంలో దర్యాప్తును వేగం చేశారు. ఈ క్రమంలోనే వారి కదలికలపై నిఘా వేసిన కోరుట్ల పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు ప్రాంతంలో ఏపీ పోలీసుల సహకారంతో చందనను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమెతోపాటు బాయ్ ఫ్రెండ్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరికి మరో వ్యక్తి కూడా సహకరించినట్లు తెలుస్తోంది. కాగా రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై ఆసక్తిగా ఉంఎదురుచూస్తున్నారు.