కోదాడ:సమాజంలో ప్రజలకు మంచి చేయాలని సదుద్దేశంతో మనమందరం జర్నలిజం వైపు అడుగులు వేసామని, అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస
కోదాడ:సమాజంలో ప్రజలకు మంచి చేయాలని సదుద్దేశంతో మనమందరం జర్నలిజం వైపు అడుగులు వేసామని, అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, అటువంటి తరుణంలో మనమందరం కూడా సంఘటితంగా ఉంటేనే సమస్యలను పరిష్కరించుకోడానికి అవకాశం ఉంటుందని, అందుకోసమే యూనియన్ల ఏర్పాటు అని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు.సోమవారం కోదాడ పట్టణం లోని మార్కెట్ కమిటీ గెస్ట్ హౌస్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్, అధ్యక్షతన .. కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా గాంధీని నియమించారు. కాగా . ప్రస్తుతం ఏబీఎన్ టీవీ ఛానల్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న గాంధీ గత దశాబ్దన్నర కాలంగా ఎలక్ట్రానిక్ మీడియా లో జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ జర్నలిస్టు వృత్తిలో నిబద్ధత తో పనిచేస్తున్నారు. యూనియన్ లో పలు పదవులు నిర్వహించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో క్రియాశీలకంగా కృషి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అందరి సహకారంతో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జర్నలిస్టులకు వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ ఉపాధ్యక్షులు చింతలపాటి సురేష్ జన్మదిన వేడుకలను జర్నలిస్టుల మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ‘తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్’ అధ్యక్షులు పడిశాల రఘు టీయూడబ్ల్యూజే H143 కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు, సురేష్ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు పూర్ణ చంద్రరావు, ఎలక్ట్రాన్ మీడియా ప్రధాన కార్యదర్శి గంధం వెంకటనారాయణ ఉపాధ్యక్షులు చింతలపాటి సురేష్, నందిపాటి వెంకన్న, కుడుముల సైదులు, మాతంగి సైదులు, గోపాల్, శ్రీకాంత్, తంగెళ్లపల్లి లక్ష్మణ్, షేక్ నజీర్, శ్రీహరి, సత్యరాజు రమేష్, మల్లయ్య, రామారావు, వేణుగోపాల్, గోపి, నరేష్, బుచ్చిరాములు, బసవయ్య, మహమూద్, దామోదర్ జి.లక్ష్మీనారాయణ, హరీష్ అశోక్ రెడ్డి, శ్రీను, నాగరాజు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.