HomeTelanganaCrime

చోరీకి వెళ్ళి బ్యాంకును ప్రశంసలతో ముంచెత్తి వెనక్కి వెళ్ళిపోయిన దొంగ‌

చోరీకి వెళ్ళి బ్యాంకును ప్రశంసలతో ముంచెత్తి వెనక్కి వెళ్ళిపోయిన దొంగ‌

ఓ దొంగ ఓ బ్యాంకును కొల్లగొట్టడానికి తాళాలు పగలగొట్టి బ్యాంకులోకి వెళ్ళాడు. అయితే అక్కడేమీ దొంగతనం చేయకుండా ఈ బ్యాంకు చాలా గొప్పదంటూ లేఖ‌ రాశి అక్కడ ప

గ్రామంపై దాడి,ప్రజలపై హింస, సామూహిక అత్యాచారాలు: 215 మంది పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష‌
‘కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్’ వ్యవహారం రచ్చ రచ్చ…కలగజేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌

ఓ దొంగ ఓ బ్యాంకును కొల్లగొట్టడానికి తాళాలు పగలగొట్టి బ్యాంకులోకి వెళ్ళాడు. అయితే అక్కడేమీ దొంగతనం చేయకుండా ఈ బ్యాంకు చాలా గొప్పదంటూ లేఖ‌ రాశి అక్కడ పడేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకలా ?

మంచిర్యాల జిల్లా వెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగతనం చేద్దామని గురువారం రాత్రి ఓ దొంగ బ్యాంకు తాళాలు పగలగొట్టి లోనికి వెళ్ళాడు. అక్కడ ఆ దొంగకు ఒక్క పైస కూడా కనిపించలేదు. దాంతో బ్యాంకు లాకర్ గదిని తెరవడానికి తీవ్ర ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దాంతో బ్యాంకు భద్రత ఏర్పాట్లు చూసి దొంగకు ముచ్చటేసింది. దాంతో ఆయన ‘‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా వేలి ముద్రలు కూడా ఉండవు’’ అని ఓ లేఖ రాసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు.

తెల్లారి బ్యాంకును తెఅరవడానికి వచ్చిన బ్యాంకు సిబ్బంది బ్యాంకు తాళాలు పగిలిపోయి ఉండటం చూసి పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించగా లోపల దొంగ వదిలి వెళ్ళిన లేఖ దొరికింది. ఆ లేఖను చూసిన‌ బ్యాంకు సిబ్బంది, పోలీసులకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదట. ఇక దొంగను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.