HomeTelanganaPolitics

సోనియాతో షర్మిల భేటీ…YSRTPలో పార్టీలో చిచ్చు…లైవ్ లో రాజీనామా చేసిన నాయకుడు

సోనియాతో షర్మిల భేటీ…YSRTPలో పార్టీలో చిచ్చు…లైవ్ లో రాజీనామా చేసిన నాయకుడు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు దగ్గరవడాని చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆమె పార్టీ నేతలు భ‌గ్గుమంటున్నారు. ఓ నాయకుడు టీవీలైవ్ లో

జగ్గారెడ్డిని BRS లో చేర్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు… ఆ పార్టీ నేతల వార్నిం గ్
కాంగ్రెస్ మార్క్ గూండాయిజం: కాంగ్రెస్ గ్రూపుల మధ్య కొట్లాట – జర్నలిస్టులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు
మధుయాష్కీ, పొంగులేటికి కాంగ్రెస్ లో కీలక పదవులు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు దగ్గరవడాని చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆమె పార్టీ నేతలు భ‌గ్గుమంటున్నారు. ఓ నాయకుడు టీవీలైవ్ లోనే పార్టీకి రాజీనామా చేయగా మరి కొంత మంది బహిరంగంగానే ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణలో వైఎస్సార్ టీపీ అనే పార్టీని ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం తెస్తానని పాదయాత్రలు చేసిన షర్మిలకు ఇక్కడ ప్రజలనుండి పెద్దగా స్పందన రాలేదు. దా‍ంతో ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమో లేక ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్ అగ్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నిన్న ఢిల్లోలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇక వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ లో విలీనమే మిగిలి ఉందనే చర్చ జరుగుతోంది.

అయితే షర్మిల వేస్తున్న ఈ అడుగులు ఆమె పార్టీలో మొదటి నుంచీ పని చేస్తున్న నాయకులకు నచ్చడం లేదు. ఆమె కాంగ్రెస్ వైపు వెళ్తుండటంపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

ఆ పార్టీ సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని షర్మిలపై నిప్పులు చెరిగారు. పైగా లైవ్ లోనే వైఎస్సార్ టీపీ పార్టీకి రాజీనామా ప్రకటించారు. వైఎస్సార్ కూతురని ఆమె ఏం చేసినా భరించామని, జగన్ కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టినా ఊరుకున్నామని కానీ ఆమె కాంగ్రెస్ లో చేరడాన్ని సహించలేకపోతున్నామని రాఘవరెడ్డి అన్నారు. ఆమె లేకపోతే తాము జగన్ తో కలిసి నడుస్తామని తెలిపారు.

మరో నాయకుడు, కళాకారుడు ఏపూరి సోమన్న కూడా షర్మిలపై మండిపడ్డారు. వైఎస్సార్టీపీ తరపున తనను తుంగతుర్తిలో నిలబెడ్తానని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నారని, ఆమె ఏ పార్టీలో చేరినా దమ్ముంటే తనకు తుంగతుర్తి టికెట్ ఇప్పించాలని సవాల్ విసిరారు.

మరో నాయకుడు గట్టు రామచంద్రరావుకూడా షర్మిల కాంగ్రెస్ లో కలవడం కోసం నిర్ణయం తీసుకోవడం తనను ధిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. కనీసం ఈ విషయంపై ముఖ్య నేతలతో కూడా చర్చించకపోవడం అప్రజాస్వామికమని ఆయన ఆరోపించారు.

కాగా, ఆమె కాంగ్రెస్ లో చేరే నాటికి వైఎస్సార్ టీపీ నాయకులు, కార్యకర్తలంతా పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆమె ఒంటరిగా కాంగ్రెస్ లో చేరాల్సి వస్తుందేమో అనే చర్చ నడుస్తోంది.