HomeCinema

ఫిట్ నెస్ కోసం ఈ హీరో నెలకు 20 లక్షలు ఖర్చు చేస్తాడు

ఫిట్ నెస్ కోసం ఈ హీరో నెలకు 20 లక్షలు ఖర్చు చేస్తాడు

హృతిక్ రోషన్ బాలీవుడ్‌లో అతిపెద్ద హీరోల‌లో ఒకరు. అనేక‌ సంవత్సరాలుగా హిందీ చిత్రసీమలో అనేక్ అవిజయవంతమైన మూవీలు చేశాడు. క్రిష్ సిరీస్ దేశవ్యాప్తంగా సంచ

దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించేది అంబానీ, అదానీలు కాదు, ఒక సినిమా హీరో
సోషల్ మీడియాలో తారల దేశభక్తి
ప్రభాస్ రోజూ తాగుతాడా? ఆ బాలీ వుడ్ డైరెక్టర్ ప్రభాస్ ను అంత మాట అనేశాడేంటి ?

హృతిక్ రోషన్ బాలీవుడ్‌లో అతిపెద్ద హీరోల‌లో ఒకరు. అనేక‌ సంవత్సరాలుగా హిందీ చిత్రసీమలో అనేక్ అవిజయవంతమైన మూవీలు చేశాడు. క్రిష్ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే విజయాలను అందించాయి. తన వ్యక్తిగత జీవితానికి, ముఖ్యంగా తన స్నేహితురాలు సబా ఆజాద్‌తో తన ప్రేమ జీవితానికి సంబంధించి తరచుగా వార్తల్లో నిలిచే ఈ నటుడు, తన బాడీ బహిరంగ ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. బాలీవుడ్ స్టార్లందరూ జలసీ ఫీలయ్యే స్థాయి హృతిక్ ఫిట్ నెస్. ఆయనకు ఇప్పుడు 50 ఏళ్ళ వయసు వచ్చినా అంత వయసు కనపడదు.బాలీవుడ్ లో హృతిక్ ఒక ఫిట్‌నెస్ చిహ్నం.

మూవీల్లో ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కోట్లలో ఉండటమే కాదు, ఆయన ఫిట్ నెస్ కోసం చేసే ఖర్చు కూడా కోట్లల్లోనే ఉంది.

ఆయన్ అతన ఫిట్ నెస్ కోసం, బాడీ షేప్ కోసం ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ని నియమించుకున్నాడు. అతని నెల జీతం నెలకు అక్షరాలా 20 లక్షల రూపాయలు . అంటే సంవత్సరానికి 2కోట్ల 40 లక్షల రూపాయలు.

ఇక హృతిక్ కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు. అతని తన విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

కాగా, ప్రస్తుతం హృతిక్క్ రోషన్ ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత వార్2 మూవీలో నటిస్తాడు. ఈ మూవీలో హృతిక్ తో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించనున్నారు.