HomeTelangana

కాంగ్రెస్ లో టికెట్ల కలవరం…

కాంగ్రెస్ లో టికెట్ల కలవరం…

•ఒక కుటుంబంలో రెండు టికెట్లు దక్కేనా…? •భారీగా దరఖాస్తులు టికెట్ వరించేది ఎవరికో… •కొనసాగుతున్న దరఖాస్తుల వడపోత •సెప్టెంబర్ 2న ప్రకటించనున్న

తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన‌ – ఆగిన‌ బస్సులు
తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన – ఆగిన‌ బస్సులు
115 మంది తో బీఆరెస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన కేసీఆర్…రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటీ

•ఒక కుటుంబంలో రెండు టికెట్లు దక్కేనా…?

•భారీగా దరఖాస్తులు టికెట్ వరించేది ఎవరికో…

•కొనసాగుతున్న దరఖాస్తుల వడపోత

•సెప్టెంబర్ 2న ప్రకటించనున్న తొలి జాబితా

•ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 130
దరఖాస్తులు

•కసరత్తు చేస్తున్న ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ…

•గాంధీభవన్ చుట్టూ నేతల ప్రదక్షిణలు

కోదాడ,(నినాదం న్యూస్) : త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ 115 టికెట్లు కేటాయించడంతో కాంగ్రెస్ కూడా 100కు పైగా టికెట్లు కేటాయించాలని కసరత్తు చేస్తుంది. అన్ని అనుకూలంగా జరిగితే సెప్టెంబర్ రెండో తారీఖున లిస్టు ప్రకటించనుంది. అధికార బిఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులను కేవలం కెసిఆర్ మాత్రమే ప్రకటిస్తారు. కానీ కాంగ్రెస్ లో అది సాధ్యం కాదు. స్క్రీనింగ్ కమిటీ చర్చించిన అనంతరం, ఆ లిస్టును ఏఐసిసికి పంపిన తర్వాత అక్కడి నుండి ఆమోదం వచ్చిన అనంతరం ప్రకటన ఉంటుంది.. ఈ నెల 18 నుండి 25 వరకు ధరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 29న హైద్రాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ టిక్కెట్ల కేటాయింపుపై కసరత్తు ప్రారంభించింది. ఆశావహులు టిక్కెట్లు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారికున్న పలుకుబడిని ఉపయోగించి టిక్కెట్లు సాధించాలని వివిధ మార్గాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ..

ఓకే కుటుంబంలో రెండు టికెట్లు దక్కేనా..?

అన్ని కోణాల నుండి ఆలోచించే వ్యతిరేకత ఏర్పడకుండా అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులకు టిక్కెట్లు కట్టబెట్టే పనిలో కమిటీ ఉంది. ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్లు ఇస్తారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలోనే నల్లగొండ ఎంపి ఉత్తమకుమార్ రెడ్డికి, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య హైద్రాబాద్ గాంధీ భవన్లో వాగ్వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సమావేశం మధ్యలోనే ఉత్తమ్ వెళ్లిపోయారు. కోదాడ నుండి నలమాద పద్మావతిరెడ్డి, హుజూర్ నగర్ నుండి నలమాద ఉత్తమకుమార్ రెడ్డి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల నుండి. జానారెడ్డి కుమారులు కుందూరు జయవీర్రెడ్డి, రఘువీర్ రెడ్డిలు టిక్కెట్లు ఆశిస్తున్నారు. వారు ధరఖాస్తులు కూడా చేసుకున్నారు. ఈ విషయంలో అధిష్టానం, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఏమి చేయనుందో వేచి చూడాలి.

130 దరఖాస్తులు…

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల నుండి ఆశావహులు 130. మంది టిక్కెట్లకు ధరఖాస్తులు చేసుకున్నారు. వడపోతకు కసరత్తు చేస్తున్నారు. ధరఖాస్తులు చేసిన పలువురు పూర్తి వివరాలను పేర్కొనకపోవడంతో పరిశీలన స్క్రీనింగ్ కమిటీకి సమస్యగా మారింది. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చేందుకు స్క్రీనింగ్ కమిటీ యోచిస్తుంది. సెప్టెంబర్ 2న తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. అత్యధికంగా 23 ధరఖాస్తులు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి వచ్చాయి. అతి తక్కువగా రెండు ధరఖాస్తులు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి వచ్చాయి. ఇది ఇలా ఉండగా టిక్కెట్లు ఖరారు చేయడం ఒక ఎత్తయితే. టిక్కెట్లు ఆశించి భంగపడిన వారిని బుజ్జగించడం మరో ఎత్తు. టిక్కెట్లు. దాని వారు అసంతృప్తికి గురై అసమ్మతివాదులుగా మారే అవకాశం జన్నందున ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా. ముందు జాగ్రత్తగా పరిపరి విధాలుగా ఆలోచించి స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. లేని పక్షంలో గెలుపు గుర్రాలు నష్టపోయే ప్రమాదం ఉంది. బిఆర్ఎస్ ముందుగానే టిక్కెట్లు ఖరారు చేయడంతో ఒక్కసారిగా అసమ్మతి జ్వాలలు అలుముకున్నాయి. నేటికీ అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలోబిఆర్ఎస్ అధిష్టానం ఉంది. కాంగ్రెస్ కూడా త్వరగా టిక్కెట్లు నిర్ణయిస్తే అనూహ్యంగా అసమ్మతి ఏర్పడితే నచ్చజెప్పి అందరినీ ఒకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో ఐక్యతారాగాలు వినిపించవచ్చు. లేని పక్షంలో అసమ్మతివాదులు ఇతర పార్టీల వైపు తొంగి చూసే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక వైపు కాంగ్రెస్ మరో వైపు బిఆర్ఎస్ అత్యంత జాగ్రత్త పడుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధరఖాస్తులు చేసుకున్నారు. భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ ఎంపి నలమాద ఉత్తమకుమార్ రెడ్డితో పాటు కొండేటి మల్లయ్య, వేదాను వెంకయ్య, పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, తండు శ్రీనివాస్ యాదవ్, సాముల శివారెడ్డి, అల్లం ప్రభాకర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పోత్నక్ ప్రమోద్ కుమార్, చెవిటి వెంకన్నయాదవ్, అద్దంకి దయాకర్, అనపర్తి జ్ఞానసుందర్ తదితరులు ధరఖాస్తులు చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు టిక్కెట్లను ఆశిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి టిక్కెటు ధరఖాస్తు చేయకుండా ఎన్నికల బరి నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆయన తన ఇరువురు కుమారులకు మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నుండి టిక్కెట్లు ఇప్పి ంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నలమాద ఉత్తమకుమార్రెడ్డి మాత్రం ఎప్పటి నుండో కోదాడలో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్న సంగతి. బహిరంగ రహస్యం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్లగొండ సీటు బిసిలకు కేటాయించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సహకరిస్తానని కొన్ని సందర్భాల్లో పార్టీ కోసం త్యాగం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా జరగబోయే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాలనే నిర్ణయానికి స్క్రీనింగ్ కమిటీ వచ్చింది. పొత్తులు ఏ మేరకు కలిగిస్తాయో అన్ని కోణాల్లో పరిశీలించిన మీదటే పొత్తు ఖరారు చేయనున్నారు.

కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఒక ఎత్తు అయితే కోదాడ నియోజక వర్గం మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. కోదాడ… ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడం తెలంగాణ ముఖద్వారం కావడంతో కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది… బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిక్లేర్ కావడంతో, ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా దానిపై చర్చ కొనసాగిస్తున్నారు. కోదాడ నుండి మాజీ ఎమ్మెల్యే పద్మావతి, కళాశాలల అధినేత పందిరి నాగిరెడ్డి, మైక్ టీవీ అధినేత అప్పి రెడ్డి, ఎన్నారై సాముల జైపాల్ రెడ్డి, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గత వారం రోజుల క్రితం కోదాడ నుండి పద్మావతి, హుజూర్నగర్ నుండి నేను బరిలో దిగుతున్నామని మీడియా సమావేశంలో చెప్పినప్పటికీ , కోదాడ నుంచి ఇంకెవరు డిక్లేర్ కాలేదని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అంటూ వారి పార్టీ ఎమ్మెల్యేకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే క్రమంలో రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాదన కొనసాగిందని తెలుస్తుంది. ఈ విషయంపై ఏటువంటి గొడవ జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించినప్పటికీ, ఇద్దరి మధ్య వాదన జరిగిందనేది వారి వద్ద ఉన్న సన్నిహితులు మీడియాకు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఒకే కుటుంబానికి ఒక టికెట్ అంటే మాత్రం కోదాడ నుండి పద్మావతికి అవకాశం లేదనే చెప్పాలి…? ఒకవేళ టికెట్ కేటాయించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది… ఇది ఇలా ఉండగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవసరమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంలో తనకున్న పరిచయాల ద్వారా రెండు టికెట్లు ఎలాగైనా తీసుకొని వస్తారని నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ లో టికెట్ల కలవరం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనే చెప్పాలి..