HomeTelanganaPolitics

కాంగ్రెస్ లో టిక్కెట్ల చిచ్చు: రేవ‍ంత్, ఉత్తమ్ వాగ్వివాదం… కోపంతో వెళ్ళిపోయిన ఉత్తమ్

కాంగ్రెస్ లో టిక్కెట్ల చిచ్చు: రేవ‍ంత్, ఉత్తమ్ వాగ్వివాదం… కోపంతో వెళ్ళిపోయిన ఉత్తమ్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ స్క్రూటినీ చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మంగళవారం గాంధీ భవన్లో సమావేశమయ్యింది. ఆ సమ

కాంగ్రెస్ లో టికెట్ల కలవరం…
50 వేల మెజార్టీ రాకుంటే పార్టీకి రాజీనామా చేస్తా!
తెలంగాణలో హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా ?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ స్క్రూటినీ చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మంగళవారం గాంధీ భవన్లో సమావేశమయ్యింది. ఆ సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు టిక్కట్ల అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ మధ్య వాడి వాడిగా వాగ్వివాదం జరిగింది.

ఒకే కుటుంబంలో సత్తా ఉన్న ఇద్దరు నాయకులుంటే ఇద్దరికీ టిక్కట్లు ఇవ్వాలనే ప్రతిపాదనను పీసీసీ అధ్యక్షుడు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే డిమాండ్ చేసినట్టు సమాచారం. అందుకు నిరాకరించిన రేవంత్, ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందని తాను ప్రతిపాదన చేయబోనని అన్నట్టు తెలుస్తోంది.

ఈ సమ‌యంలోనే ఒకే కుటుంబానికి రెండు సీట్ల అంశంపై మహేశ్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచిందని తెలుస్తోంది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారని ఉత్తమ్ మహేశ్ గౌడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

అంతే కాకుండా ఈ విషయాన్ని అధిష్టానం వద్ద పీసీసీ అధ్యక్షుడే ప్రతిపాదన చేయాలని ఉత్తమ్ రెట్టించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్, తనకు ఆదేశాలివ్వొద్దంటూ గట్టిగా చెప్పినట్టు సమాచారం. దాంతో కోపంతో రగిలిపోయిన ఉత్తమ్ ఆవేశంగా సమావేశంలోంచి లేచి వెళ్ళిపోయినట్టు సమాచారం.

వీరి మధ్యనే కాక బీసీలకు సీట్ల విషయంలో హన్మ౦తరావు, మహిళలకు సీట్ల విషయంలో రేణుకా చౌదరి లు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బీసీలకు ఎన్ని టిక్కెట్లు ఇస్తున్నారో చెప్పాలని హన్మంత రావు, మహిళలకు ఎన్ని టిక్కెట్లు ఇస్తున్నారో చెప్పాలని రేణుకా చౌదరిలు డిమాండ్ చేశారు.

సర్వే ఆధారంగా టిక్కెట్లు ఇస్తున్నట్లు చెప్తున్నారని, ఒకవేళ సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఇచ్చేట్టయితే, దరఖాస్తులు తీసుకోవడం, స్క్రూటినీ చేయడం లాంటి తంతంగం అంతా ఎందుకని పలువురు నేతలు ప్రశ్నించినట్టు సమాచారం.