HomeTelanganaPolitics

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో…బిఆర్ఎస్ లో లుకలుకలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో…బిఆర్ఎస్ లో లుకలుకలు

•పార్టీ లైన్ దాటి విమర్శలు…•అధిష్టానానికే సవాళ్లు విసురుతున్న నేతలు…•సిట్టింగులకు సహకరించమంటూ బహిరంగ ప్రకటనలు•పార్టీ కార్యకర్తలలో నెలకొన్న అయోమయం..

వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ.!
బీజేపీకి రాజీనామా చేసి కా‍ంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి
వెంటనే పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో BRS, ఏపీలో YSRCP స్వీప్..టైమ్స్ నౌ సర్వే

•పార్టీ లైన్ దాటి విమర్శలు…
•అధిష్టానానికే సవాళ్లు విసురుతున్న నేతలు…
•సిట్టింగులకు సహకరించమంటూ బహిరంగ ప్రకటనలు
•పార్టీ కార్యకర్తలలో నెలకొన్న అయోమయం..

కోదాడ, ఆగస్టు 29
(నినాదం న్యూస్):

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిఆర్‌ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. జిల్లాలో పార్టీ అంతటా ఒక్కతాటిపై ఉందని అది కూడా మంత్రి నాయకత్వంలో పటిష్టంగా ఉందని అధిష్టానం గీసిన గీత దాటరని రాష్ట్ర నాయకత్వం భావించింది. తాము చేసిన నిర్ణయాలకు అనుగుణంగానే
నేతలు పనిచేస్తారని అనుకున్నారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జిల్లాలో పార్టీ లైన్ దాటిన విమర్శలు అధిష్టానానికే సవాల్ విసురుతున్నారు…

అంతా అధిష్టానం నిర్ణయమే..

రానున్న ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి విజయం సాధించి అధికారంలోకి రావలనేది బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ లక్ష్యం. దానికి అనుగుణంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ తిరిగి టికెట్లు కేటాయించారు.వీరిలో కంచర్ల భూపాల్రెడ్డి (నల్లగొండ), కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (మునుగోడు), చిరుమర్తి లింగయ్య(నకిరెకల్), రమావత్ రవీంద్రకుమార్ (దేవరకొండ), నల్లమోతు భాస్కర్రావు (మిర్యాలగూడ), శానంపూడి సైదిరెడ్డి (హుజూర్ నగర్), బొల్లం మల్లయ్యయాదవ్ (కోదాడ), గుంటకండ్ల జగదీష్ రెడ్డి (సూర్యపేట), గాదరి కిషోర్కుమార్ (తుంగతుర్తి), పైళ్ల శేఖర్రెడ్డి (భువనగిరి), గొంగిడి సునీత మహేందర్రెడ్డి (ఆలేరు), నోముల భగత్ (సాగర్) సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ అభ్యర్ధులుగా ప్రకటించారు.

సిట్టింగులకు తప్పని తిరుగుబాటు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి పార్టీ అధినేత కెసిఆర్ అవకాశం ఇవ్వడం పట్ల ఆయా నియోజకవర్గాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేలకు తిరుగుబాటు ఎదురవుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు.ఆయనతోపాటు మరికొందరు కూడా ఉన్నట్లు సమాచారం. రెండు రోజులక్రితం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ వచ్చే ఎన్నికలలో తనకు సపోర్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో ఉండి కూడా కలవడానికి ఇష్టపడకుండా లేనని చెప్పించినట్లు సమాచారం. మల్లయ్యయాదవ్ ్ను మార్చాలని తెలంగాణ ఉద్యమకారుడు శశిధర్రెడ్డి సిఎం కెసిఆర్కు విన్నవించినట్లు తెలిసింది. తుంగతుర్తి అభ్యర్థిగా గాదరి కిశోర్ను ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గిడ్డంగుల కార్పోరేషన్ మాజీ చైర్మన్ మందు ల సామేల్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి నిరసన తెలిపారు. అంతేగాకుండా నియోజకవర్గంలో స్థానికత పేరుతో ఎస్సీ సామాజికవర్గం పేరుతో పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు వినికిడి. నకిరెకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు టికెట్ కేటాయించడం నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచురులతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి తీరుతానని l ప్రతిభబునారు. మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పట్ల బైఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయినప్పటికీ ఇపుడు కూడా ఆయనకే టికెట్ ఇవ్వడం పట్ల అక్కడ టికెట్ కోసం ఆశపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని సమాచారం. నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న నేతలు ఎమ్మెల్యేకు పొసగడం లేదు.బయటకు చెప్పకపోయినా అంతర్గతంగా వారి మనస్సులో ప్రస్తుత ఎమ్మెల్యేలను ఓడించాలని గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, భువనగిరి నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో వాళ్లంతా ప్రస్తుతం ఎమ్మెల్యేకు సహకరించే పరిస్థితి లేదని సమాచారం. నల్లగొండ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి టికెట్ ఆశించారు. చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే కెసిఆర్ మరోసారి అవకాశం ఇవ్వడంతో కిషన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. మరో బిసి నాయకుడు, స్థానిక కౌన్సిలర్ పిల్లి రామరాజుయాదవ్ నియోజకవర్గంలో ఫౌండేషన్ ద్వారా చనిపోయిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందిస్తూ నియోజకవర్గంలో బలమైన పట్టు సాధించాడు.
ఈ ఎన్నికలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఇలా ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దగా ఎవరు మాట్లాడినట్లు కనిపించడం లేదు.
ఇప్పటికే అధికార పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత లేదని అందరు భావిస్తున్నారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించి అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకొని అధికారంలోకి రావాలని కెసిఆర్ భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికలలో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి..