•కోదాడ, హుజూర్నగర్ లో 50వేల మెజార్టీతో విజయం సాధిస్తున్నాం. •రాష్ట్రంలో టిఆర్ఎస్ బిజెపిలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయి. •కోదాడలో శాండో ల్యాండ
•కోదాడ, హుజూర్నగర్ లో 50వేల మెజార్టీతో విజయం సాధిస్తున్నాం.
•రాష్ట్రంలో టిఆర్ఎస్ బిజెపిలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయి.
•కోదాడలో శాండో ల్యాండు వైన్స్ మైన్స్ అక్రమ వ్యాపారాల్లో బిఆర్ఎస్ నాయకులు…
•ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
•నిరుద్యోగ భృతి ఏమైంది నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం
•నిరుద్యోగుల పక్షాన ఎన్.ఎస్.యూ.ఐ పోరాడుతుంది..
•ఎన్ .ఎస్ .యూ ఐ రాష్ట్ర అధ్యక్షులు
బలుమూరి వెంకట్ ..
కోదాడ,ఆగస్టు 28
(నినాదం న్యూస్): ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, అవినీతికి పాల్పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదని, మళ్లీ వారికే టికెట్లు కేటాయించి,రాబోవు ఎన్నికలలో ధన బలంతో గెలవాలని చూస్తున్నా ఈ బిఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని, టిపిసిసి మాజీ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.. సోమవారం కోదాడ పట్టణంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 50వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు50వేల ఓట్లకు ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. కోదాడ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ల్యాండు శాండు మైండ్స్ వైన్స్ అక్రమ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిచారని విమర్శించారు. తమకు పిల్లలు లేరని రెండు నియోజకవర్గాల ప్రజలు తమకు పిల్లలతో సమానమని వెల్లడించారు కోదాడ నుండి పద్మావతి హుజూర్నగర్ నుండి తాను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నామన్నారు. 70 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్నారు ఎన్నికల హామీలు విస్మరించిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు ఓటమి భయంతో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై నాయకులపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు .
కోదాడలో అవినీతి రాజ్యమేలుతుంది…
ఎన్ .ఎస్ .యూ ఐ రాష్ట్ర అధ్యక్షులు బలుమూరి వెంకట్ , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డిలు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పతనానికి దగ్గరకు వచ్చిందని ఎద్దేవా చేశారు దేశంలో మోడీ జిఎస్టి టాక్స్ విధిస్తే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బియం వై టాక్స్ విధించారని ఘాటుగా విమర్శించారు ప్రతి వ్యాపారంలో ప్రతి పథకంలో అవినీతి కోదాడ నియోజకవర్గంలో రాజ్యం ఏలిందన్నారు గంజాయి రవాణా చేస్తూ బిఆర్ఎస్ నాయకులు యువతను పెడదోవ పట్టించారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్నారు కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాగా కోదాడ పట్టణంలో ఎన్.ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో వందలాదిమంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు జై కాంగ్రెస్ జై ఉత్తమ్ అంటూ నినాదాలతో కోదాడ మారుమోగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, తూమాటి వరప్రసాద్ రెడ్డి, ముసుగు శ్రీనివాస్ రెడ్డి,డేగ శ్రీధర్ ,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ఎజాజ్ ,యిర్ల సీతారామిరెడ్డి ,ఎంపీటీసీ హిమ బిందు, సుమన్ రెడ్డి, వంగవీటి రామారావు, రజనీకాంత్ ,గంధం యాదగిరి ,పార సీతయ్య ,తదితరులు పాల్గొన్నారు.