HomeCinema

జైలర్ మూవీలో విలన్ వేసుకున్న ఆ షర్ట్ ని తీసేయాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

జైలర్ మూవీలో విలన్ వేసుకున్న ఆ షర్ట్ ని తీసేయాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) జెర్సీని ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ధరించి ఉన్న జెర్సీని థియేటర్లలో సెప్టెంబరు 1 నుంచి ప్రదర్శించరాదని ఢిల్ల

గుంటూరు కారం మూవీపై షారూఖ్ ఖాన్ ట్వీట్
మంత్రి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం : నాగార్జున
నన్ను క్షమించండి… చేతులు జోడించిన ఆదిపురుష్ డైలాగ్ రైటర్

ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) జెర్సీని ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ధరించి ఉన్న జెర్సీని థియేటర్లలో సెప్టెంబరు 1 నుంచి ప్రదర్శించరాదని ఢిల్లీ హైకోర్టు “జైలర్” చిత్ర నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాతలు RCB జట్టు జెర్సీని కించపరిచేలా ఉపయోగించారని ఐపీఎల్ టీమ్, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఈ తీర్పునిచ్చారు. రజనీకాంత్ నటించిన ఈ చిత్రం టెలివిజన్, శాటిలైట్ లేదా ఏదైనా ఓటీటీ ( ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫారమ్ లలో కూడా ఆ జెర్సీ లేకుండా విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.

సినిమాలో కాంట్రాక్ట్ కిల్లర్ జెర్సీ ధరించి ఒక మహిళ గురించి అవమానకరమైన, స్త్రీ ద్వేషపూరిత మాటలు మాట్లాడాడని RCB తరపు లాయర్ ఆరోపించారు. అనుమతి లేకుండా తమ జెర్సీని ఉపయోగించడం వల్ల తమ బ్రాండ్ ఇమేజ్, ఈక్విటీ దెబ్బతింటుందని ఐపీఎల్ టీమ్ వాదించింది.

దావా దాఖలు చేసిన తర్వాత, చిత్రనిర్మాతలు , IPL బృందం తమ వివాదాలను పరిష్కరించుకున్నారు. ఇందులో విలన్ RCB జెర్సీ వేసుకొని ఉన్న‌ సన్నివేశాలను మార్చాడానికి చిత్రనిర్మాతలు అంగీకరించారు.

నిర్మాతలు RCB జెర్సీపై ఉన్న ప్రాథమిక రంగులు, బ్రాండింగ్ ను తొలగిస్తారు.

సినిమా ఇప్పటికే ఆగస్టు 10న థియేటర్‌లలో విడుదలైనందున, పది రోజుల్లో అంటే సెప్టెంబర్ 1, 2023 నాటికి థియేట్రికల్ వెర్షన్‌లో మార్పు చేస్తామని నిర్మాతలు అంగీకరించారు.