HomeTelangana

Telangana: రాబోయే ఎన్నికల్లో రజాకార్ల సర్కార్ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది -అమిత్ షా

Telangana: రాబోయే ఎన్నికల్లో రజాకార్ల సర్కార్ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది -అమిత్ షా

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బీజేపీతో చేతులు కలిపిందంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ఆరోప

బీజేపీ అధిష్టానాన్ని ఫూల్ చేసిన అభ్యర్థి
30 పార్టీలు Vs 24 పార్టీలు… దేశంలో వేడి పుట్టిస్తున్న రాజకీయాలు
తెలంగాణలో హిందుత్వ దూకుడు తగ్గించడం, అవసరమైతే పార్లమెంటులో BRS మద్దతు పొందడం…ఇవీ ఇప్పుడు బీజేపీ లక్ష్యాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బీజేపీతో చేతులు కలిపిందంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం స్పందించారు. ఖమ్మంలో జరిగిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, ‘బీజేపీ కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలతో ఎప్పటికీ జతకట్టదని, బదులుగా మేము వారిపై పోరాడతాం’ అని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వానికి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మద్దతిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఒవైసీ లేదా కేసీఆర్‌తో కలిసిపోతుందని నమ్ముతున్నారా అని సబ్ హకు వచ్చిన‌ ప్రజలను ఆయన అడిగారు.

మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. ‘అధికారం పంచుకోవాడం కాదుకదా కనీసం మేము (బీజేపీ, బీఆర్‌ఎస్) ఒకే వేదికను కూడా పంచుకోం అన్నారు. కాంగ్రెస్ పార్టీయే గతంలో బీఆరెస్ తో పొత్తుపెట్టుకున్న విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, మోడీ నాయకత్వంలో బీజేపీ నుంచి వస్తారని ఆయన అన్నారు.

కుటుంబ‌ రాజకీయాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎంలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. వాటిని “4G, 3G, 2G” పార్టీలు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 4జీ పార్టీ–జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాజీ, రాజీవ్, ఇప్పుడు రాహుల్ గాంధీ–ఇది నాలుగు తరాల పార్టీ అని, కేసీఆర్ పార్టీ 2జీ పార్టీ అని, ఒవైసీ పార్టీ 3జీ పార్టీ అని అమిత్ షా అన్నారు.

2జీ రాదు, 3జీ రాదు, 4జీ రాదు.. ఇప్పుడు కమలం వంతు వచ్చింది’’ అని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో రజాకార్లకు మద్దతు ఇస్తున్న బీఆరెస్ ను ఓడించి వచ్చే ఎన్నికల్లో ప్రెఅజలు బీజేపీని అధికారంలోకి తీసుకరాబోతున్నారని అమిత్ షా స్పష్టం చేశారు.