వచ్చే అసెంబ్లీలో పోటీ చేసే BRS అభ్యర్థుల లిస్ట్ కేసీఆర్ ప్రకటించక ముందు ఒక మాట ప్రకటించిన తర్వాత మరో మాటగా తయారయ్యింది కామారెడ్డి నియోజకవర్గ పరిస్థిత
వచ్చే అసెంబ్లీలో పోటీ చేసే BRS అభ్యర్థుల లిస్ట్ కేసీఆర్ ప్రకటించక ముందు ఒక మాట ప్రకటించిన తర్వాత మరో మాటగా తయారయ్యింది కామారెడ్డి నియోజకవర్గ పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి కలిసి వచ్చే అంశంగా కనిపించింది. ఈ సారి తన గెలుపు ఖాయమని షబ్బీర్ కూడా ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని అనౌన్స్ కాగానే పరిణామాలు అతివేగంగా మారిపోతున్నాయి.
కాంగ్రెస్ వైపు ఉన్న గ్రామాలు కూడా బీఆరెస్ వైపు మళ్ళుతున్నాయి. ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలోని పది గ్రామాలు తాము కేసీఆర్ కే ఓటు వేస్తామని మరే పార్టీ ఓటు అడగడానికి తమ ఊరికి రావద్దని ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమి తండా, వెనుక తండ, బోడగుట్ట తండా, మైసమ్మచూరు, రాజకన్‌పేట, వడ్డెరగూడెం, గుండితండా, దేవునిపల్లి గ్రామాల పంచాయతీల్లో కేసీఆర్‌కు ఓటేస్తామంటూ తీర్మానం చేశారు. శనివారం మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఆమెను కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు.
ప్రజలు కేసీఆర్ కు మద్దతుగా స్వచ్చందంగా రావడం అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత అన్నారు. షబ్బీర్ అలీ ఎన్ని కబుర్లు చెప్పినా కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టడం ఖాయమైపోయిందన్నారు. కామారెడ్డిలోని అన్ని గ్రామాల ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు.
కాగా , ఈ రోజు తీర్మానాలు చేసిన గ్రామాల బాటలోనే మరిన్ని గ్రామాలు కూడా తీర్మానాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.