HomeNationalCrime

టీచర్ ముసుగులో మతోన్మాది..ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన ఉపాధ్యాయురాలు

టీచర్ ముసుగులో మతోన్మాది..ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన ఉపాధ్యాయురాలు

పిల్లలకు మంచి చెడ్డలు బోధించాల్సిన,మతము, కులము, వర్గాలకు అతీతంగా పిల్లలందరినీ సమానంగా చూడాల్సిన, వారికి సమానత్వం గురించి బోధించాల్సిన ఓ టీచర్ మతోన్మా

మావోయిస్టుల‌ దాడి, 35మంది భద్రతా సిబ్బంది, ముగ్గురు మావోయిస్టుల‌ మృతి ‍- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
హైదరాబాద్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర‌ కమిటీ నాయకుడి అరెస్ట్ ?
కోరుట్ల దీప్తిని చంపింది స్వంత చెల్లెలే!

పిల్లలకు మంచి చెడ్డలు బోధించాల్సిన,మతము, కులము, వర్గాలకు అతీతంగా పిల్లలందరినీ సమానంగా చూడాల్సిన, వారికి సమానత్వం గురించి బోధించాల్సిన ఓ టీచర్ మతోన్మాదిగా వ్యవహరించింది. లెక్కలు సరిగా చేయలేదనే కారణంగా ఓ ముస్లిం బాలుడిపై తాను డాడి చేయడమే కాక అతని తోటి విద్యార్థులతో దాడి చేయించింది. మతం గురించి అభ్యంతరకరంగా కామెంట్లు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్,ఖబ్బర్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెలుగు చూసింది.

“ఎంతమంది ముస్లిం పిల్లలు ఉన్నారో అందరిని నేను……” అంటున్న‌ ఉపాధ్యాయురాలు కెమెరాకు చిక్కింది, ఆమె ముస్లిం విద్యార్థిని కొట్టడం కోసం మిగిలిన తరగతిలోని వారిని ఒకరి తర్వాత ఒకరు పిలిచారు.
వైరల్ వీడియోలో, “అతన్ని గట్టిగా కొట్టండి” అని ఉపాధ్యాయురాలు ప్రోత్సహించడంతో విద్యార్థులు తమ తోటి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టారు. ఒక సందర్భంలో, ముస్లిం విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన తర్వాత అతని నడుముపై కొట్టమని ఆమె ఒక విద్యార్థిని ఆదేశించింది.

ఆ బాలుడిని ఆమె కొట్టడమే కాక అక్కడున్న హిందూ పిల్లలందరితో ఒకరి తర్వాత‌ ఒకరిని పిలిచి ఆ బాలుడుపై దాడి చేయించింది.

తన కుమారుడిని పాఠశాల నుంచి తొలగించి పాఠశాల అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. ఒప్పందం ప్రకారం తాను పోలీసులకు ఫిర్యాదు చేయనని, తన కుమారుడి అడ్మిషన్ ఫీజు ను పాఠశాల వాపసు ఇస్తుందని వివరించారు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. మన్సూర్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడామని, వీడియోపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
“పోలీసులకు సోషల్ మీడియా ద్వారా వీడియో గురించి తెలిసింది. వీడియోలో, ఒక మహిళా టీచర్ ఇతర విద్యార్థులను తమ క్లాస్‌మేట్‌ని కొట్టమని కోరింది. ఎందుకంటే అబ్బాయికి మ్యాథ్స్ టేబుల్ గుర్తులేదు. ఆమె చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా వీడియోలో వినబడతాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడాను’’ అని ఎస్పీ సత్యన్నారాయణ ప్రజాపత్ తెలిపారు.

ముస్లిం విద్యార్థుల తల్లులు తమ పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, వారందరినీ ఇలాగే కొట్టాలని ఆ మహిళా టీచర్‌ అన్నట్లు తెలిసింది. ఘటనపై విద్యాశాఖకు సమాచారం అందించామని, ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి తెలిపారు.

ప్రాథమిక విద్యాశాఖ అధికారి శుభమ్ శుక్లా మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు, పాఠశాల యాజమాన్యంపై దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.