HomeCinema

“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీకి అవార్డు ఇవ్వడంపై మండిపడ్డ‌ తమిళనాడు సీఎం స్టాలిన్

“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీకి అవార్డు ఇవ్వడంపై మండిపడ్డ‌ తమిళనాడు సీఎం స్టాలిన్

69వ జాతీయ అవార్డులలో గెలుపొందిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిని వారిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ అభినందించారు. అయితే “ది కాశ్మీర్ ఫైల్

జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, RRR కు 6 జాతీయ అవార్డులు
నన్ను క్షమించండి… చేతులు జోడించిన ఆదిపురుష్ డైలాగ్ రైటర్
బేబీ సినిమా హీరో, హీరోయిన్‌కు రెమ్యునరేషన్ ఎంతిచ్చారో తెలుసా?

69వ జాతీయ అవార్డులలో గెలుపొందిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిని వారిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ అభినందించారు. అయితే “ది కాశ్మీర్ ఫైల్స్” అనే వివాదాస్పద మూవీకి జాతీయ సమైక్యత అవార్డు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు.

జాతీయ అవార్డుల గౌరవాన్ని “చౌకబారు రాజకీయాల” కోసం ప్రభావితం చేయకూడదని ఆయన అన్నారు.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం అవార్డు గెలుచుకోవడంపై స్టాలిన్ సోషల్ మీడియా పోస్ట్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయా విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న గాయని శ్రేయా ఘోషల్, సంగీత విద్వాంసుడు శ్రీకాంత్ దేవా , ‘కడైసి వివాహాయి’ , “సిర్పిగాలిన్ సిర్పంగల్” చిత్ర నిర్మాతలను ఆయన అభినందించారు.

“మరోవైపు, వివాదాస్పద చిత్రంగా పార్టీలకతీతంగా సినీ విమర్శకులు బహిష్కరించిన చిత్రానికి జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రంగా నర్గీస్ దత్ అవార్డును ప్రకటించడం దిగ్భ్రాంతికరం” అని ఆయన ది కశ్మీర్ ఫైల్స్ పేరు చెప్పకుండా అన్నారు. సాహిత్య రచనలు, చిత్రాలకు ఇచ్చే అవార్డులు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ఇది మాత్రమే వాటిని భావితరాలకు ఉన్నతంగా ఉంచుతుందని ఆయన అన్నారు. చౌకబారు రాజకీయాల కోసం జాతీయ అవార్డుల పరువు పోకూడదని స్టాలిన్ అన్నారు.

కాగా, తమ మూవీకి అవార్డు దక్కడంపై స్టాలిన్ చేసిన కామెంట్స్ ను కశ్మీర్‌ ఫైల్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఖండించారు. ”స్టాలిన్ దేశాన్నే ప్రశ్నిస్తున్నారు. మా మూవీకి రెండు అవార్డులు రావడం కోసం తాము ఎలాంటి లాబీయింగ్ చేయలేదు. ప్రజల మద్దతుతోనే అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను కశ్మీర్‌ పండిట్లకు అంకితం చేస్తున్నాము. దేశంలో ధర్మాన్ని రక్షించడమే మా కర్తవ్యం.” అని అభిషేక్‌ అగర్వాల్ అన్నారు.