69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఆగస్టు 24న ప్రకటించారు. పుష్ప మూవీలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు రాగా, 'RRR', 'పుష్ప' ఉప
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఆగస్టు 24న ప్రకటించారు. పుష్ప మూవీలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు రాగా, ‘RRR’, ‘పుష్ప’ ఉప్పెన తదితర ఇతర తెలుగు చిత్రాలు ఈసారి అవార్డుల్లో ఆధిపత్యం చెలాయించాయి. మరోవైపు కుల సమస్యలపై తీసిన తమిళంలో సూర్య ‘జై భీమ్’, ధనుష్ ‘కర్ణన్’, ఆర్య ‘సర్పత్త పరంబరై’, వంటి సినిమాలు అటకెక్కాయి. దీనిపై నెటిజనులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
కుల సమ్స్యపై తీసిన ఈ మూవీలేకాకుండా శింబు ‘మానాడు’, మలయాళంలో జోజు జార్జ్ ‘నాయట్టు’, టోవినో థామస్ ‘మిన్నాల్ మురళి’ వంటి సినిమాలకు కూడా ఎలాంటి అవార్డులు రాలేదు. ఈ అంశంపై కోపంతో ఉన్న అభిమానులు జాతీయ చలనచిత్ర అవార్డులను ‘జోక్’ అని వ్యాఖ్యానించారు.
‘జై భీమ్’, ‘కర్ణన్’, ‘సర్పత్త పరంబరై’ వంటి మూవీలు దేశంలో వేళ్ళునుకొని ఉన్న కుల వివక్ష, అణిచివేతలను, అగ్రకులాల వల్ల దళితులు అనిభవిస్తున్న బాధలు, కష్టాలను ప్రపంచం ముందు ఉంచాయి. దళిత సమస్య పట్ల బీజేపీకి ఉన్న వ్యతిరేకత వల్లనే ఈ మూవీలను జాతీయ చలనచిత్ర అవార్డులలో తిరస్కరించారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
మత, కుల సమస్య పట్ల ఆరెస్సెస్, బీజేపీ విధానాలకు అనుగుణంగానే జాతీయ చలనచిత్ర అవార్డుల కమిటీ ప్రవర్తించిందని పలువురు ఆరోపిస్తున్నారు.
తమిళ చిత్రం ‘కడైసి వివాహాయి’ ఉత్తమ తమిళ చిత్రంగా నిలివగా, హోమ్’ 69వ ఉత్తమ మలయాళ చిత్రంగా నిలిచింది.
కాగా, తమది కృతజ్ఞత లేని పని అని, అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యమని అవార్డులను ప్రకటించే ముందు జ్యూరీ పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధమైనదని పునరుద్ఘాటించారు.
”మన కులతత్వ సమాజపు నిజాన్ని చూపించడానికి ఎవరూ సాహసించరు. అందుకే జై భీమ్ సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డు రాలేదు.” అని ‘ది దళిత్ వాయిస్’ ట్విట్టర్ హ్యాండిల్ వాఖ్యానించింది.
”జాతీయ అవార్డులు కేవలం పేరు కోసం మాత్రమే, వారు అధికార పార్టీకి మద్దతు ఇచ్చే వారి అభిమాన వ్యక్తులకు మాత్రమే అవార్డులు ఇస్తారు. ఇది దారుణమైన వివక్ష. వారికి కళ, సంస్కృతి , మహిళల పట్ల గౌరవం లేదు.” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Jai Bhim these movie didn't include in National Film award. Do you know why because no one dares to show the truth of our Casteist society.#NationalFilmAwards2023 pic.twitter.com/2QSvpbbswz
— The Dalit Voice (@ambedkariteIND) August 24, 2023