తెలుగు రాష్ట్రాల్లో బీటెక్ పై ఉన్న మోజు మామూలిది కాదు. తల్లి తండ్రులు బిడ్డపుట్టగానే డాక్టరో లేక ఇంజనీర్ లక్ష్యంతో పెంచడం మొదలుపెడ్తారు. ఇక్కడ మెడికల
తెలుగు రాష్ట్రాల్లో బీటెక్ పై ఉన్న మోజు మామూలిది కాదు. తల్లి తండ్రులు బిడ్డపుట్టగానే డాక్టరో లేక ఇంజనీర్ లక్ష్యంతో పెంచడం మొదలుపెడ్తారు. ఇక్కడ మెడికల్ సీట్లు తక్కువ కాబట్టి మెజార్టీ పేరెంట్స్ ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతారు.
టెంత్ అయిపోగానే నారాయణ, చైతన్య అనే జైళ్ళు… ఆ తర్వాత ఎంసెట్… ఆ పై ఏదో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించడం, అటు తర్వాత అమీర్ పేట లో ఏవో నాలుగు సాఫ్ట్ వేర్ కోర్సులు చేయడం…ఆ వెంటనే అమెరికా చెక్కేయడం.
ఇదీ తమ పిల్లల కోసం తల్లి తండ్రులు కఠినంగా అమ్లు పర్చే వరస క్రమం. తల్లి తండ్రుల ఈ బలహీనత వల్ల తెలుగు రాష్ట్రాల్లో పాన్ షాపులకన్నా ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.
ఇప్పుడీ వరస విచ్చినమవుతోంది. ఎప్పుడుంటాయో ఎప్పుడు ఊడుతాయో తెలియని సాఫ్ట్ వేర్ జాబ్ ల పట్ల మోజు తగ్గిపోతున్నట్లుంది. ఒకప్పుడు తమ పిల్లలకు ఇంజనీరింగ్ సీటు రాకపోవడం తమ పరువుకే భంగమనుకునే తల్లితండ్రులు ఇప్పుడు వేరే కోర్సుల వైపు దృష్టి పెడుతున్నారు.
ఈ సారి తెలంగాణ టెలఙనలో బీటెక్ B Tec మొదటి సంవత్సరంలో ఏకంగా 16 వేల సీట్లు మిగిలిపోయాయి. ఎంసెట్ EMCETస్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ తో బీటెక్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 178 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 69,375 (80.97%) సీట్లు మాత్రమే నిండాయి. ఇంకా 16, 296 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా CSE, IT కోర్సుల్లో 5,723 సీట్లు భర్తీ కాలేదన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్electronics and electrical engineeringలో 4,959 సీట్లు, సివిల్ Civil, మెకానిక్ mechanicalలలో మరో 5,156 సీట్లు మిగిలిపోయాయని తెలిపారు.
ప్రైవేట్ కాలేజీల్లో 14,511 సీట్లు మిగిలిపోగా.. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 289 సీట్లు, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలే కొన్నింటిని భర్తీ చేసుకున్నప్పటికీ ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలిపోనున్నాయి.