HomeCinemaEditor's Choice

జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, RRR కు 6 జాతీయ అవార్డులు

జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, RRR కు 6 జాతీయ అవార్డులు

69వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకుగానూ ఈ అవార్డులను అనౌన్స్‌ చేశారు. ఢిల్లీలో గురువారం సాయంత్రం ఈ ఈవెంట్ జర

ఈ హీరోల్లో అత్యంత ధనవంతులెవరో తెలుసా ?
సోషల్ మీడియాలో తారల దేశభక్తి
టాలీవుడ్ స్టార్లను ‘నాని’ అవమానించాడా? మండిపోతున్న ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్

69వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకుగానూ ఈ అవార్డులను అనౌన్స్‌ చేశారు. ఢిల్లీలో గురువారం సాయంత్రం ఈ ఈవెంట్ జరిగింది. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి.

ఇప్పటికే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి స్టంట్ కొరియోగ‍్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మేల్ సింగర్, కొరియోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్ తదితర కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. అలానే ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 69 ఏండ్ల చరిత్రలో మొదటిసారి తెలుగు హీరోకు జాతీయ నటుడిగా అవార్డు వచ్చింది. ఉత్తమ తెలుగు సినిమా గా ఉప్పెన అవార్డు అందుకుంది.

ఉత్తమ తెలుగు సినిమా : ఉప్పెన

ఉత్తమ నటుడు : అల్లు అర్జున్‌ (పుష్ప)

ఉత్తమ నటిగా అలియాభట్‌ (గంగూబాయ్ కథియావాడి)

బెస్ట్‌ ఎడిటర్‌ : సంజయ్ లీలా బన్సాలీ (గంగూబాయ్‌ కథియావాడి)

ఉత్తమ నటి: కృతిసనన్‌ (మిమి)

బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌: కింగ్ సోలోమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్‌ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ : ఎంఎం కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ప్లేబ్యాక్ సింగర్‌ : కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ : ఆర్ఆర్‌ఆర్‌

బెస్ట్ పాపులర్ సినిమా : ఆర్‌ఆర్‌ఆర్‌

ఉత్తమ లిరిసిస్ట్ చంద్రబోస్‌(కొండపొలం)

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: దేవీ శ్రీ ప్రసాద్‌ (పుష్ప)

బెస్ట్‌ తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్‌: పురుషోత్తమ చార్యులు

బెస్ట్‌ హిందీ ఫిల్మ్‌: సర్దార్‌ ఉధమ్‌

బెస్ట్‌ గుజరాతీ ఫిల్మ్‌: ఛల్లో షో