HomeTelanganaPolitics

మరో బీఆరెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన హైకోర్టు

మరో బీఆరెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన హైకోర్టు

మరో బీఆరెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. కొద్ది రోజుల క్రితం కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావును అనర్హుడిగా ప్రకటించి జలగం వెంకట్రావును

అమిత్ షా ఒత్తిడితో చివరకు కాసినో కింగ్ చీకోటిని బీజేపీలో చేర్చుకున్నారు
బీజేపీలోకి క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ?
బండి సంజయ్ కి కీలక పదవి – ప్రకటించిన నడ్డా

మరో బీఆరెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. కొద్ది రోజుల క్రితం కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావును అనర్హుడిగా ప్రకటించి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు ఈ రోజు గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా తీర్పు చెప్పింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ప్రకటించింది.

కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని రుజువవ్వడంతో కోర్టు నిర్ణయం తీసుకుంది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల చెల్లదని తీర్పు ఇచ్చింది. రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. ఇందులో 50 వేలు పిటిషనర్ డీకే అరుణకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ప్రకటించింది. కాగా కృష్ణమోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందంటూ రెండవ స్థానంలో ఉన్న డీకే అరుణ హైకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే.

కాగా కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనర్హత తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి కూడా సుప్రీం ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.