HomeNational

ముస్లిం అయినందుకు ఫస్ట్ వచ్చిన అమ్మాయిని వదిలేసి సెకండ్ వచ్చిన వారికి అవార్డు ఇచ్చారు

ముస్లిం అయినందుకు ఫస్ట్ వచ్చిన అమ్మాయిని వదిలేసి సెకండ్ వచ్చిన వారికి అవార్డు ఇచ్చారు

గుజరాత్ లోని మెహసానా పట్టణంలో ఉన్న శ్రీ కె. టి. పటేల్ స్మృతి విద్యాలయ లో పదవతరగతిలో 87% స్కోర్ సాధించి అర్నజ్ భాను అనే బాలిక స్కూల్ ఫస్ట్ గా నిలించిం

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన ఇండియా… ఆసిస్ పై గెలుపు
ఇంత దారుణమా ? హిందూ, ముస్లింలు స్నేహం కూడా చేయొద్దా ?
‘కేటీఆర్ భయంతో అనేక మంది హీరోయిన్లు పెళ్ళి చేసుకొని పారిపోయారు’

గుజరాత్ లోని మెహసానా పట్టణంలో ఉన్న శ్రీ కె. టి. పటేల్ స్మృతి విద్యాలయ లో పదవతరగతిలో 87% స్కోర్ సాధించి అర్నజ్ భాను అనే బాలిక స్కూల్ ఫస్ట్ గా నిలించింది.

10వ తరగతి, 12వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన వారిని సన్మానించేందుకు, అవార్డులు ఇచ్చేందుకు ఆగస్టు 15న స్వాతంత్ర్యదినోత్సవం రోజున‌ స్కూల్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో స్కూల్ ఫస్ట్ వచ్చిన అర్నజ్ భాను కు కాకుండా సెకండ్ వచ్చిన మరో విద్యార్థిని సన్మానించి, అవార్డు ఇచ్చారు. దాంతో బోరున విలపిస్తూ అర్నాజ్‌బాను ఇంటికి తిరిగి వచ్చింది.

ఆమె తండ్రి, లునావా గ్రామానికి చెందిన సన్వర్ ఖాన్, ఈ సంఘటనపై తన బాధను వ్యక్తం చేస్తూ, “తనకు దక్కాల్సిన అవార్డు రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థికి అందించారని నా కూతురు మాకు చెప్పారు. నేను పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులను వివరణ కోరాను. కానీ వారి జవాబులు అస్పష్టంగా ఉన్నాయి. జనవరి 26న రివార్డ్ అందజేస్తామని వారు హామీ ఇస్తున్నప్పటికీ, నా ప్రశ్న మాత్రం ఆగస్ట్ 15న ఎందుకు ఇవ్వలేదు ? ఈ భూమిలో పాతుకుపోయిన రైతుగా, మా కుటుంబం తరతరాలుగా ఎలాంటి వివక్షకు గురికాకుండా ఇక్కడే జీవిస్తోంది. కానీ ఇప్పుడు నా కుమార్తెకు ఉద్దేశపూర్వకంగా ఆమెకు అర్హమైన అవార్డును ఇవ్వడానికి తిరస్కరించారు.

శ్రీ కె. టి. పటేల్ స్మృతి విద్యాలయ ప్రిన్సిపాల్ బిపిన్ పటేల్ ఓ ప్రముఖ వెబ్ పోర్టల్ తో మాట్లాడుతూ, “మా పాఠశాల వివక్షల‌కు వ్యతిరేకంగా కఠినమైన విధానాన్ని అమలుపరుస్తుంది. నిశ్చయంగా, అర్హురాలైన విద్యార్థికి జనవరి 26న రివార్డ్ ఇస్తాం. ఆగస్ట్ 15న ర్నజ్ భాను గైర్హాజరు అయ్యింది.” అని చెప్పారు.

సన్వర్ ఖాన్ దీనిని వ్యతిరేకిస్తూ, “ప్రిన్సిపల్ వాదన అబద్దం. నా కుమార్తె ఆ రోజు పాఠశాలకు వెళ్లింది. పాఠశాల CCTV కెమెరాలలో చూడండి నిజాలు బైటపడతాయి.” అని చెప్పారు.

ఈ సంఘటనపై వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నెటిజనులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రచయిత సలీల్ త్రిపాఠి ఒక ట్వీట్‌లో, “ఇది మోడీ-ఫైడ్ ఇండియా స్థితి” అని అన్నారు.

ఈ వివాదంపై పాఠశాల ఉపాధ్యాయుడు అనిల్ పటేల్ మాట్లాడుతూ, “ఆగస్టు 15 ఈవెంట్ మా విద్యార్థుల విజయాలను గుర్తించడానికి ఒక చిన్న వేడుక. అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి రివార్డులు అధికారికంగా జనవరి 26న అందించబడతాయి. ఏవైనా ఫిర్యాదులను పరిష్కరించడానికి, మా విద్యార్థులందరి విజయాలను గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాము.” అన్నారు.

‘బేటీ బచావ్, బేటీ పడావ్’ అనే ప్రధాని మోడీ నినాదం నేపథ్యంలో గుజరాత్ లోని శ్రీ కె. టి. పటేల్ స్మృతి విద్యాలయ లో జరిగిన ఈ వివక్షాపూరిత సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.