HomeTelangana

బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు… రోడ్డెక్కిన నాయకులు, కార్యకర్తలు

బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు… రోడ్డెక్కిన నాయకులు, కార్యకర్తలు

భారత రాష్ట్ర సమితి BRSలో అసంతృప్తి రగులుకుంటోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు అసెంబ్లీ సీట్లలో సిట్టింగులకుకాకుండా మరొకరికి సీటు ఇస్తారనే ప్రచారంత

C Voter సర్వే పై మండిపడ్డ‌ BRS, తమ‌ గెలుపు ఖాయని వ్యాఖ్య‌
మహిళా విద్యార్థులకు ఎమ్మెల్సీ కవిత కుమారుల చేయూత.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ.!

భారత రాష్ట్ర సమితి BRSలో అసంతృప్తి రగులుకుంటోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు అసెంబ్లీ సీట్లలో సిట్టింగులకుకాకుండా మరొకరికి సీటు ఇస్తారనే ప్రచారంతో సిట్టి‍ంగ్ ఎమ్మెల్యేల అనుచరులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలకు దిగారు.

జనగాం Jangau , స్టేషన్ ఘన్ పూర్ Station Ghanpur నియోజక వర్గాలకు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలతో జనగాం ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి Muttireddy Yadagiri reddy, స్టేషన్ ఘణ్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య Rajayya అనుచరులు ఈ రోజు నిరసనలకు దిగారు.

జనగాంలో ముత్తిరెడ్డికి బదులు ఎమ్మెల్సీ పల్లా రేజేశ్వర్ రెడ్డి Palla Rajeshvar reddyకి టికట్ ఇస్తారనే ప్రచారంతో భగ్గున మండిపోయిన ముత్తి రెడ్డి అనుచరులు పల్లా కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. జనగామలో పల్లాకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ, ల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘జనగాం ను దేశానికి అన్నంపెట్టే నియోజకవర్గంగా తయారు చేశాను. అలాంటి జనగాం ను పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగం చేశాడు. ఎమ్మెల్సీ అయిన ఈ ఏడేళ్ళలో జనగాంకు పల్లా ఏం చేశాడు ? డబ్బులు పంచడం ద్వారా పలువురు నాయకులను తన వైపు తిప్పుకొని డిస్ట్రబ్ చేస్తున్నాడు. నా ఇంట్లో చిచ్చుపెట్టాడు. నా కూతురును రెచ్చగొట్టి బజారుకెక్కించింది పల్లానే. మా నాయకుడు కేసీఆర్ KCR ఏది చెప్తే అది చేస్తాను. ఆయన టికట్ ప్రకటించేదాకా పల్లా ఎందుకు ఆగడం లేదు? తొలి లిస్ట్ లో జనగాం టిక‌ట్ ను ప్రకటించాలి. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని టికట్ ఇవ్వాలి.” అని ముత్తి రెడ్డి అన్నారు.

మరో వైపు స్టేషన్ ఘన్ పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు కూడా నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ సారి స్టేషన్ ఘన్ పూర్ టికట్ కడియం శ్రీహరిKadiyam Sreehari కి ఇస్తారన్న ప్రచారంతో వారంతో ఆగ్రహంతో ఉన్నారు. రాజయ్యకే టికట్ ఇవ్వాలని, కడియంకు ఇవ్వొద్దంటూ రాజయ్య అనుచరులు నినాదాలు చేశారు.