HomeUncategorized

ఆందోల్ లో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి భారీ వలసలు… కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

Massive migration from Congress to TRS in Andol... MLA Kranti Kiran invited by wearing a scarf

ఆందోల్ లో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి భారీ వలసలు… కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

ఆందోల్ నియోజకవర్గం లో మేజర్ గ్రామ పంచాయితీ అయినటువంటి చౌటకూర్ గ్రామ సర్పంచ్ వీరమని మోగులయ్య తో పాటు మరికొందరు కాంగ్రెస్స్ కార్యకర్తలు బి ఆర్ ఎస్ లో చ

గంగమ్మ తల్లీ ఆశీసులు ప్రతీ ఒక్కరికీ కలగాలి
ఘనంగా నేలకొండపల్లి లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14 వ వర్థంతి
తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు

ఆందోల్ నియోజకవర్గం లో మేజర్ గ్రామ పంచాయితీ అయినటువంటి చౌటకూర్ గ్రామ సర్పంచ్ వీరమని మోగులయ్య తో పాటు మరికొందరు కాంగ్రెస్స్ కార్యకర్తలు బి ఆర్ ఎస్ లో చేరారు. ఆందోల్ శాసనసభ్యులు శ్రీ చంటి క్రాంతి కిరణ్ గారు కండువ వేసి వారిని పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.
మంతురు వీరయ్య
కొలుకూరి అంజయ్య
మంతురు నర్సింలు
నగడారం బాబు
నాగండ్ల మల్లేశం
మంతూరి రాములు
గౌరీశం మొగులయ్య లు బి ఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి కే సి ఆర్ గారితోనే సాధ్యం అన్నారు. ప్రజలను తన కన్న బిడ్డలు గా చూసుకుంటూ వారి సంక్షేమం కోసం ఎవలేని కృషి చేస్తున్నాడని అన్నారు. పేదలు రైతులే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి నీ చూసి బి ఆర్ ఎస్ లో చెరడానికి గ్రామాలు గ్రామాలే తరలుతున్నయన్నరు. రెండు నెలల కాలంలోనే దాదాపు వంద గ్రామాల నుంచి కాంగ్రెస్స్ కార్యకర్తలు బి ఆర్ ఎస్ లోకి వచ్చారు అంటే అందోల్ లో బి ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాంలేదని స్పష్టం అవుతోందన్నారు. ఈ సారి తిరుగులేని మెజారిటీ ఖాయమన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి సాధిస్తుంది అంటే దానికి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కారణమని
చౌటకూర్ సర్పంచ్ వీరమని మొగులయ్య అన్నారు. వీరితో పాటు కురుమ సంఘం నుంచి 25 మంది కూడా పార్టీలో చేరారు.
చౌటకూర్ మండల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌకంపల్లి శివకుమార్ చొరవతో చేరికలు జరిగాయి.